Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఉద్యోగులంతా అవినీతిపరులేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అవినీతి మన దేశంలో ఎప్పుడో వ్యవస్థీకృతమైపోయింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అవినీతి రాజ్యమేలుతోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. అలాగని, అందరూ అవినీతిపరులేనా.? అలా ఆలోచించడం కూడా తప్పే. కొందరు అవినీతిపరుల కారణంగా, అందరికీ చెడ్డపేరు వస్తోందన్నది నిర్వివాదాంశం.

ఓ శాఖలో అవినీతి జరుగుతోందంటే, సంబంధిత శాఖా మంత్రికి ఆ అవినీతిలో వాటా లేకుండా వుంటుందా.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంటుంది. కాంట్రాక్టర్లకీ, రాజకీయాలకీ వున్న లింకులేంటో, ఆ లింకుల వల్ల ఇరు వర్గాలకూ జరుగుతున్న రాజకీయ లబ్ది ఏంటో అందరికీ తెలిసిన విషయమే.

రాజకీయమంటే సేవ.! కానీ, రాజకీయ నాయకులు ఆయా పదవుల్లో కూర్చునేందుకు తొక్కే అడ్డదారుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? నామినేటెడ్ పోస్టుల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేసేది ఎందుకు.? దోచుకోవడానికే కదా.! ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు మాత్రమే కాదు, వార్డు మెంబర్‌గా పోటీ చెయ్యడానికీ టిక్కెట్టు కోసమే లక్షల్లో ఖర్చు చేయాల్సిన రోజులివి.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, ఉద్యోగుల మీద విషం చిమ్ముతోంది. ఉద్యోగులంతా అవినీతిపరులే.. అన్నట్టు అధికార వైసీపీ అనుకూల మీడియా అడ్డగోలు కథనాల్ని తెరపైకి తెస్తోంది. ఉద్యోగులు పీఆర్సీ విషయమై చేస్తున్న ఉద్యమానికి ‘అవినీతి’ మరక అంటించేస్తోంది బులుగు మీడియా.

వాలంటీర్ వ్యవస్థ వచ్చాక, ఉద్యోగులకు అవినీతి చేసే ఆస్కారం వుండడంలేదనీ, తద్వారా వారికి ప్రత్యామ్నాయ ఆదాయం తగ్గిందనీ, ఉద్యోగుల గొడవ జీతాలు పెంచడం గురించి కాదనీ, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించడమే వారి లక్ష్యమనీ సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ.. వైసీపీ పెయిడ్ బృందం కథనాల్ని ప్రచారం చేస్తోంది.

‘కామన్ మేన్’ పేరుతో అధికార పార్టీ అనుకూల మీడియా, ప్రభుత్వ ఉద్యోగులపై చేయిస్తున్న వ్యాఖ్యలు.. మొత్తంగా ఉద్యోగులనే వ్యవస్థకే మకిలి అంటించేలా వుంది. ఉద్యోగులు లేకపోతే, ప్రభుత్వమెలా మనుగడ సాధిస్తుంది.? ఉద్యోగులకు మకిలి అంటించడమంటే, మొత్తం వ్యవస్థకు మకిలి అంటుకున్నట్టే కదా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...