పచ్చ కామెర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. పిచ్చికి పరాకాష్ట ఏంటంటే, ‘వకీల్ సాబ్’ టైటిల్ పసుపు రంగులో వుందని బులుగు బ్యాచ్ గగ్లోలు పెట్టడం. అంటే, ఇక్కడ పచ్చ కామెర్లు కాస్త బులుగు చొక్కాలకి వచ్చాయని అనుకోవాలేమో.
‘వకీల్ సాబ్’ సినిమా ట్రైలర్ నిన్న విడుదలయ్యింది. నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో, బులుగు చొక్కాలకి భలే మేటర్ దొరికేసిందన్నమాట. మరీ ఇంత కక్కుర్తి ఏంటి.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నార. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున ట్రైలర్ విడుదల చేసి, సినిమా టైటిల్ పసుపు రంగుతో రూపొందించి, తాను అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్త అని ప్రూవ్ చేసిన పవన్.. అంటూ బులుగు బ్యాచ్ ఒకే కంటెంట్ పట్టుకుని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ట్వీట్లేశారు. ‘నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.?’ అన్నట్టు తయారైంది బులుగు బ్యాచ్ తీరు.
చిత్రమేంటంటే, ఈ విషయంలో బులుగు బ్యాచ్, పచ్చ బ్యాచ్ ఒకటే అయిపోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద బురద చల్లేందుకు ప్రయత్నించాయి. వైసీపీ అనుకూల మీడియాకి చెందిన అక్కుపక్షి బ్యానర్ ఏ రంగులో వుంటుంది.? బులుగు రంగు టైటిల్.. దాని వెనుక పసుపు రంగు.. ఇది కదా నికార్సయిన ‘ప్యాకేజీ’ అంటే.?
గురివింద తన డాష్ కింద నలుపుని పక్కన పెట్టి, ఇతరుల మీద బురద చల్లాలని చూస్తుందట. బులుగు బ్యాచ్ పరిస్థితీ అంతే మరి. సినిమా టైటిళ్ళకీ రాజకీయ రంగులు పులిమేయాలనుకునే బులుగు, పచ్చ పైత్యానికి ‘మందు’ ఇంకా కనుగొనలేదు.. ఎవరూ కనుగొనలేరు కూడా.
565568 614287It is really a nice and beneficial piece of info. Im glad which you just shared this beneficial information with us. Please maintain us informed like this. Thanks for sharing. 939429
126950 874864I was looking for this. Genuinely refreshing take on the details. Thanks a great deal. 849852