Switch to English

బులుగు కార్మికులకి వైఎస్ షర్మిలతో పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. రెండూ వేర్వేరు కాదు.! కాకపోతే, ‘వేర్వేరు’ అన్నట్లుగా ‘కలరింగ్’ అంతే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగమే, వైఎస్సార్ తెలంగాణ పార్టీగా ఆవిర్భవించిందన్నది బహిరంగ రహస్యం. అక్కడికేదో, అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయంగా విభేదాలొచ్చాయనే బిల్డప్పుతో చిత్ర విచిత్రమైన రాజకీయాలు ఇరు రాష్ట్రాల్లో ఇరువురూ నడిపేస్తున్నారు.. తెలుగు ప్రజల్ని వెర్రి వెంగళప్పలుగా మార్చేస్తూ.. అన్న వాదన లేకపోలేదు.

సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ‘నన్ను మరదలిగా సంబోదించిన మంత్రిని వీధి కుక్క అనాలా.? చెప్పుతో కొట్టాలా.?’ అంటూ వైఎస్ షర్మిల గుస్సా అయ్యారు. మహిళ అని కూడా చూడకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తన మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో సంస్కారం వుండాలని కూడా నీతులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టేవరకూ, వైసీపీతోనే ఆమె వున్నారు. ఆ వైసీపీ నేతల్లో కొందరు బూతు శిఖామణులుగా మారిపోయి, రాజకీయాల్ని భ్రష్టు పట్టించేస్తున్న విషయం విదితమే. మరి, అన్నగారి పార్టీలోని బూతు పండితుల విషయమై వైఎస్ షర్మిల ఎందుకు పెదవి విప్పరట.?

సరే, ఆ సంగతీ పక్కన పెట్టేద్దాం. ‘మహిళను పట్టుకుని బూతులు తిడతారా.? ఇదేనా మీ సంస్కారం.?’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో గుస్సా అవుతున్నారు. ఆయా సోషల్ మీడియా అక్కౌంట్లను పరిశీలిస్తే, అవి వైసీపీకి చెందిన మద్దతుదారులవేనని తేలుతుంది.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపైనా, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపైనా.. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఈ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే వస్తున్నాయి. ‘అక్క షర్మిలకి’ మద్దతు తెలిపే క్రమంలో నీతులు మాట్లాడుతున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం, ఏపీలో మాత్రం ఇంకో రకమైన రాజకీయం చేస్తోంది. ఇదే విషయాన్ని సాధారణ నెటిజన్లు ప్రస్తావిస్తూ, వైసీపీని కడిగి పారేస్తున్నారు.

దాంతో, వైసీపీ సోషల్ మీడియా టీమ్‌కి పెద్ద తలనొప్పే వచ్చి పడుతోంది. తమకు సాధారణ నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్నలకు వైసీపీ బులుగు పేటీఎం కార్యకర్తలు సమాధానం చెప్పలేక గింజుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...