Switch to English

అమరావతిపై విద్వేషం.! విశాఖపై ఎలాంటి విషం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్వేషపూరిత వ్యాఖ్యలే చేసింది.! కమ్మరావతి, ముంపు ప్రాంతం, ఎడారి, స్మశానం.. ఇలాంటి మాటలు వైసీపీ నేతల నుంచి, అందునా మంత్రుల నుంచి అమరావతిపై వచ్చాయంటే, అది విద్వేషం కాక మరేమిటి.?

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని ఖాకీలు చితక్కొట్టారు.. బూటుకాళ్ళతో నలిపేశారు.. మహిళలన్న విచక్షణ లేకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు.! సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా అమరావతిలో రైతుల మీద అకృత్యాలు జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

పరదాలు కప్పుకుని ముఖ్యమంత్రి సహా, మంత్రులు అమరావతి రోడ్లపై వెళ్ళాల్సి వచ్చింది. అణచివేతని అమరావతి రైతులు లెక్క చేయలేదు. పోరాటం చేస్తూనే వున్నారు. భూములిచ్చిన పాపానికి ఇంత దారుణ హింసకు ప్రభుత్వం పాల్పడటమా.? అని అమరావతి రైతులు ఇంకా నెత్తీ నోరూ బాదుకుంటూనే వున్నారు.

‘రాజధాని ఎక్కడికీ వెళ్ళదు. అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నా..’ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పి, హైద్రాబాద్ నుంచి అమరావతికి కాపురం మార్చి, అక్కడే ప్యాలెస్ కట్టుకుని, అక్కడి నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఆ అమరావతి మీద విద్వేషం వెల్లగక్కారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అమరావతిలో రాజధాని పేరుతో ఒక్క ఇటుక కూడా అదనంగా వైసీపీ హయాంలో పేర్చబడలేదంటే, రాజధాని పట్ల ఎంతటి విద్వేషంతో వైసీపీ అధినాయకత్వం వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడిక విశాఖ మీద పడింది మనసు.! రుషి కొండని తొలిచేశారు.. అక్కడో ప్యాలెస్ కట్టేశారు.! కాపురం విశాఖలో.. అంటూ గత కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్నారు వైఎస్ జగన్. చాలా పండగలు వచ్చాయ్.. వెళ్ళాయ్.. ముహూర్తాలు మారుతూ వచ్చాయి. తాజా ముహూర్తం, వచ్చే ఎన్నికలు.. ఆ తర్వాత పదవీ ప్రమాణ స్వీకారమట.!

మళ్ళీ గెలిచి, విశాఖ నుంచే పరిపాలన చేస్తానంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖలోనే కాపురం వుంటాననీ చెబుతున్నారు. కామెడీ ఏంటంటే, అమరావతి మీద ఎలాంటి ద్వేషమూ లేదనీ, అది శాసన రాజధానిగా వుంటుందనీ, రాజధాని మాత్రం విశాఖపట్నమేననీ వైఎస్ జగన్ సెలవిచ్చారు.

అమరావతిని కమ్మరావతి అన్నారు కదా.? మరి, విశాఖను ఏం అనబోతున్నారబ్బా.? విశాఖ మీద ఎలాంటి నిందలు వేయాలని ప్లాన్ చేస్తున్నారబ్బా.? ఈ ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.

ఇంతకీ, న్యాయ రాజధాని కర్నూలు సంగతేంటి.? సందట్లో సడేమియా, కర్నూలుకి వైసీపీ పూర్తి స్థాయిలో మొండిచెయ్యి చూపినట్లే కనిపిస్తోంది. రాయలసీమ బిడ్డ కదా.. ఆ రాయలసీమలోని కర్నూలుపై సీతకన్నేయడమేంటబ్బా.? అదే మరి మ్యాజిక్కు అంటే.!

అమరావతి అనుభవం.. విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘వద్దు మహాప్రభో..’ అంటూ ముఖ్యమంత్రి ‘రాజధాని’ వ్యాఖ్యలపై విశాఖ వాసులు గుస్సా అవుతున్నారు. ‘అయినా, నువ్వు గెలిస్తే కదా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్‌పై సెటైర్లు పడుతున్నాయ్.

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర రాజధాని పట్ల ఇంతటి విద్వేషం ప్రదర్శించిన దాఖలాల్లేవు. ఏ రాష్ట్ర రాజధాని మీద కూడా కులం ముద్ర వేసిన సందర్భమే లేదు.! ఏ రాజధానినీ ఎడారి అనిగానీ, స్మశానం అనిగానీ ఇప్పటిదాకా ఏ అధికార పార్టీ అన్న దాఖలాలే లేవు. ఆ ఘనత పూర్తిగా వైసీపీకే దక్కుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...