ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అల్లోపతి వైద్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్న తరుణంలో ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తనను అరెస్టు చేయడం అతడి నాన్న వల్ల కూడా కాదంటూ సెటైర్ వేశారు. ఇది మరో దుమారానికి దారి తీసింది. అల్లోపతి వైద్యం కరోనా నియంత్రణలో విఫలమైందంటూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫైర్ అయింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేసింది.
ఈ దుమారం కొనసాగుతుండగా రాందేవ్ బాబా తాజాగా జూమ్ సమావేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్టు చేయడం అతడి నాన్న వల్ల కూడా కాదంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను దుండడుడు, మహాదొంగ అంటున్నారంటూ నవ్వుతూ చెప్పారు. అయితే, అతడి తండ్రి కూడా తనను అరెస్టు చేయలేరంటూ ఎవరిని ఉద్దేశించి రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేశారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
291823 760019Amazing post will be posting this on my blog today maintain up the great function. 559175
110811 521477Have you noticed the news has changed its approach recently? What used to neve be brought up or discussed has changed. It is that time to chagnge our stance on this though. 486150