ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ నెల 9న ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరిస్తోన్న విషయం విదితమే. చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ ప్రముఖుల బృందం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.. తమ సమస్యల్ని ప్రభుత్వం ముందుంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా ఇటీవలే చిరంజీవి బృందం భేటీ అయిన విషయం విదితమే.
అయితే, తనను పిలవకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారంటూ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు, బూతులు కూడా తిట్టేశారు. పైగా, ‘రియల్ ఎస్టేట్’ అంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీకి చిరంజీవి దూరంగా వుంటారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, చిరంజీవి అస్సలేమాత్రం బాలయ్య వ్యాఖ్యల్ని పట్టించుకోరనీ, గతంలోనూ చిరంజీవి విషయంలో పరోక్షంగా బాలయ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తే చిరంజీవి మాత్రం హుందాతనంతో వ్యవహరించారనీ, పైగా ‘బాలయ్య చిన్న పిల్లాడిలాంటోడు..’ అని చిరంజీవి తేల్చేశారనీ.. సో, వైఎస్ జగన్‌తో భేటీకి చిరంజీవి వెళ్ళడం ఖాయమనీ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి, గతంలోనూ చిరంజీవి ఓ సారి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాల్సిందిగా అప్పట్లో వైఎస్ జగన్‌ని కోరిన చిరంజీవి, ఆ సందర్భంలో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపైనా చర్చించారు. ‘అన్నా.. మీరు మీ ఆలోచనలతో రండి.. ప్రభుత్వం తరఫున మేం సంసిద్ధంగా వుంటాం..’ అని అప్పట్లోనే వైఎస్ జగన్ చెప్పారు కూడా చిరంజీవితో. ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ కూడా చిరంజీవి నేతృత్వంలోనే సినీ పరిశ్రమ తమ వద్దకు రావాలని ఆశించడంలో వింతేముంది.? ఇక, రాజకీయంగా టీడీపీ – వైసీపీ మధ్య వున్న విభేదాల నేపథ్యంలో ఒకవేళ ఈ భేటీకి సినీ పరిశ్రమ తరఫున బాలయ్యకు ఆహ్వానం అందినా ఆయన వెళ్ళే అవకాశమే లేదు.
కానీ, బాలయ్య మరోమారు సినీ పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తేనో.! ఈ సారి వ్యవహారం కాస్త సీరియస్‌గా వుంటుందనీ, అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకున్నాకే వైఎస్ జగన్‌తో చిరంజీవి బృందం సమావేశానికి ముహార్తం ఖరారు చేశారనీ తెలుస్తోంది.
611055 758859I surely did not recognize that. Learnt one thing new today! Thanks for that. 620933
332728 889354i was just browsing along and came upon your blog. just wantd to say excellent web site and this post really helped me. 830908
963337 11441good post. Neer knew this, thankyou for letting me know. 33950