Switch to English

అమరావతిపై ‘ఢిల్లీ’ లీకుల్లో నిజమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం ‘జోక్యం’ షురూ అయ్యిందట. కేంద్రం, రాష్ట్రంలో తాజా పరిణామాలపై దృష్టి సారించిందనీ, రాజధాని మార్పు విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దూకుడుకు కళ్ళం వేయాలనే ఆలోచనతో వుందనీ ‘లీకులు’ అందుతున్నాయి. అదేంటో, ఈ లీకులన్నీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అనుకూల మీడియాకే అందుతుంటాయి. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పరిశీలనలో వున్నాయి.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ బిల్లుల్ని కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ వద్దకు పంపగా, గవర్నర్‌ న్యాయ సలహా కోరారనీ, న్యాయసలహా అనంతరం ఆ బిల్లులు తిరిగి గవర్నర్‌ వద్దకు చేరాయనీ ప్రచారం జరుగుతోంది. ఏ క్షణాన అయినా గవర్నర్‌ ఈ బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు విన్పిస్తున్న వేళ, కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటోందనీ, తాజా పరిస్థితులపై నివేదికల్ని కూడా సంబంధిత వర్గాల నుంచి కేంద్రం కోరిందనీ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఇందులో నిజమెంత.?

నిజానికి, అమరావతి విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరితో కన్పిస్తోంది. అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినా, రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. అప్పట్లో టీడీపీ – బీజేపీ మిత్రపక్షాలుగా వున్నాయి కూడా. అయితే, ఆ తర్వాత పరిణామాలు మారాయి. అమరావతిపై బీజేపీ నేతలు చాలా అవినీతి ఆరోపణలు చేశారు. ఇందులో ‘కుల పరమైన’ ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ, రాజధాని అమరావతిలోనే వుండాలనే గత ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి వున్నామంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు.

అమరావతి కోసం జరిగిన, జరుగుతున్న ఉద్యమాల్లో బీజేపీ పాల్గొంటూనే వుంది. కానీ, రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేననీ.. ఇందులో కేంద్రం జోక్యం వుండదని జీవీఎల్‌ నరసింహారావు లాంటి కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి, కేంద్రం.. అమరావతి విషయంలో జోక్యం చేసుకుంటోందన్న ప్రచారం నిజమేనా.? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం మోకాలడ్డుతుందా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...