ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు .. కోలీవుడ్ హీరోలు. జాతీయ నటుడు కమల్ హాసన్ తో మొదలైన ఈ పరంపరను ఇప్పటికి కుర్ర హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. కమల్ హాసన్ తరువాత ఆ రేంజ్ లో ప్రయోగాత్మక సినిమాల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు విక్రమ్. చియాన్ గా తన అభిమానులతో పిలిపించుకునే విక్రమ్ ఈ సారి ఏకంగా 25 గెట్టప్పులతో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు.
ఒక సినిమాలోనే ఎక్కువ గెటప్పులతో అదరగొట్టిన హీరోల్లో .. అక్కినేని .. నవరాత్రులు సినిమాలో 9 గెటప్పులలో అదరగొడితే .. దశావతారం కమల్ హాసన్ పది గెటప్స్ తో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు విక్రమ్ ఏకంగా 25 గెటప్స్ తో అపరిచుతుడేమిటి .. అంతకుమించేలా షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
అపరిచితుడు లాంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా లాభం లేకపోయింది. అందుకే సరికొత్త ప్రయోగానికి సిద్దమయ్యాడు. తాజగా అయన 25 పాత్రలతో చేస్తున్న ప్రయోగాత్మ సినిమాకు కోబ్రా అనే టైటిల్ ఖరారు చేశారు. ఆ సినిమాకు సంబందించిన టైటిల్ వీడియో ని విడుదల చేసారు. కోబ్రా టైటిల్ వీడియో అదరగొట్టేలా ఉంది.
డీమాంట్ కాలనీ, ఎమైక్క నానోడిగళ్ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు చిత్రీకరణం పూర్తీ కావొచ్చిందని, సమ్మర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో విక్రమ్ సూపర్ హిట్టే కాదు అంతకు మించి విజయాన్ని అందుకుంటాడని ఫాన్స్ సంబరపడుతున్నారు.
820265 290141Some really intriguing info , properly written and broadly speaking user pleasant. 899684
684022 886294very nice post, i definitely enjoy this fabulous site, persist with it 89482
898100 240999I conceive this web website holds some real superb details for everybody : D. 809674
706508 636935several thanks for telling!. Truth is usually the most effective vindication against slander. by Abraham Lincoln.. 787266