తమిళనాడు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన జయలలిత కు సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఆప్తులు ఉన్నారు. అందులో ఒకరు విజయశాంతి. జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా పేరు దక్కించుకోవడంతో పాటు ఆమెతో చెల్లి అని విజయశాంతి పిలిపించుకునే వారు. అంతటి అనుబంధం ఇద్దరి మద్య ఉంది. జయలలిత చనిపోయిన సమయంలో విజయశాంతి చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో ఆమె నిరాశ నిస్పృహలో మునిగి పోయారు. నేడు అమ్మ జయంతి సందర్బంగా మరోసారి విజయశాంతి తనకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా జయలలితతో కలిసి దిగిన పొటోను షేర్ చేయడంతో పాటు చాలా తనకు ప్రాణ హాని ఉన్న సమయంలో ప్రభుత్వం తరపున పటిష్టమైన భద్రతను కల్పించారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న తనను కాపాడిన వ్యక్తి జయలలిత అంటూ రాములమ్మ చెప్పుకొచ్చారు. విజయశాంతిని గతంలో ఒక మీటింగ్ లో తన సోదరి అంటూ జయలలిత సంభోదించింది. దాంతో అప్పటి నుండి కూడా జయలలిత అంటే విజయశాంతికి ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ సమయంలో ఆమెకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎక్కడో ఒక చోట ప్రిన్సెస్ గా పుట్టి ఉంటారు. కాని మాకు తెలిసిన మీ పుట్టిన రోజు ఇదే కనుక మా శుభాకాంక్షలు అందుకోండి అంటూ జయలలితకు ఎమోషనల్ శుభాకాంక్షలు తెలియజేశారు.
797394 854978I notice there is definitely lots of spam on this weblog. Do you require support cleaning them up? I may assist between courses! 740433
966398 273436Glad to be one of several visitants on this wonderful internet internet site : D. 981506