తమిళనాడులో బడా ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ భారతదేశంలోకే బిగ్గెస్ట్ సినిమా అనదగ్గ ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. రికార్డు ధరకు ఈ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. లైకా హక్కులు సొంతం చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసారు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ పై కేవలం తెలుగులోనే కాక అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తోన్న సినిమా కావడంతో అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
730939 109906quite good put up, i undoubtedly adore this internet website, carry on it 60367
243401 808489Numerous thanks I ought say, impressed with your web site. I will post this to my facebook wall. 667593