‘ఇది దేశ బడ్జెట్లా లేదు. నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లా వుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేన్నట్టుంది. రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రిగారు సూచించిన ఏ విషయాన్నీ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు..’ అంటూ కేంద్ర బడ్జెట్ ప్రసంగం తర్వాత వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మీడియా ముందు వాపోయారు.
అదేంటీ, ‘కేంద్ర ప్రభుత్వ పెద్దలతో టచ్లో వున్నాం. కేంద్రం – రాష్ట్రం మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు మావంతుగా మేం ప్రయత్నిస్తున్నాం. కేంద్రానికి చెప్పే అన్నీ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాకు సన్నిహిత సంబంధాలే వున్నాయి..’ అని నిన్న మొన్నటిదాకా వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు కదా.! పైగా, ఈ మాటలు ఎక్కువగా చెబుతూ వచ్చింది విజయసాయిరెడ్డి గారే కావడం గమనార్హం.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచేస్తామని చెప్పిన వైసీపీనే, ఇప్పుడు ‘కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు’ అనడమేంటి.? అయినా, ముఖ్యమంత్రిగారు పదే పదే ‘అడుగుతూనే వుంటాం’ అని చెబుతూ వస్తున్నారు కదా.. ఇంకో మూడేళ్ళు అడుగుతూనే వుండండి మరి.. అన్నది జనం, వైసీపీ మీద వేస్తున్న సెటైర్.
రాజధాని అమరావతి (అమరావతితో పాటు మరో రెండు రాజధానులు విశాఖ, కర్నూలు) వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో వైసీపీ విఫలమయ్యిందని కేంద్ర బడ్జెట్ తర్వాత విసారె ప్రసంగాన్ని బట్టి అర్థమవుతోంది. అసలు కేంద్రం, రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని విసారె చెబుతున్నారంటే.. ఇప్పటిదాకా ‘కేంద్రంతో సత్సంబంధాలు’ అని ఆయన చెప్పిన మాటలే అసత్యాలనుకోవాలి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి.. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రమే నిధులు ఇవ్వాలి.. వెనుకబడిన జిల్లాలు (రాయలసీమ, ఉత్తరాంధ్ర) అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ రావాలి.. స్టీల్ ప్లాంట్, పోర్టు.. ఇవన్నీ రావాలి. కానీ, ఇవేవీ రాలేదు.. రావు కూడా. ఎందుకంటే, అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. ఈ ఇద్దరూ కేంద్రానికి సాగిలా పడటమే రాష్ట్రానికి పెను శాపం.
121446 824847I will appropriate away grab your rss feed to remain up to date on any succeeding articles you may write 47812
685704 665124I like this website so much, bookmarked . 163958
246004 918472Cheers for this excellent. I was wondering whether you were planning of publishing related posts to this. .Keep up the superb articles! 551044
962415 806810Correct humans speeches should seat as properly as memorialize around the groom and bride. Beginer sound system about rowdy locations should always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. best man speeches brother 56006
180839 925169This plot doesnt reveal itself; it has to be explained. 400419