వరస సినిమాలతో విక్టరీ వెంకటేష్ మంచి జోరు మీదున్నాడు. ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 సినిమాల షూటింగ్ లను పూర్తి చేసేసాడు. ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. కరోనా తగ్గుముఖం పట్టాక ఎఫ్ 3 షూటింగ్ తిరిగి మొదలుకానుంది. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలనుకుంటున్నాడు వెంకటేష్.
దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే వెంకటేష్ డిజిటల్ డెబ్యూ గురించి వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ కోసం వెంకటేష్ ఒక వెబ్ ఫిల్మ్ చేయబోతున్నాడని తెలిసింది.
దీనికి కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. వెంకటేష్ మహా ఇప్పటికే రాజశేఖర్ తో సినిమాను కన్ఫర్మ్ చేసారు. అది పూర్తైన తర్వాత వెంకటేష్ తో ఓటిటి ఫిల్మ్ ను మొదలుపెడతారు. వచ్చే ఏడాది ఇది జరిగే అవకాశం ఉంది.