Switch to English

39 ఏళ్ళ వయసుకే 38 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా కష్టంగా మారిపోతోంది చాలా మందికి. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, పది మంది కాదు, పాతిక మందీ కాదు.. ఏకంగా 38 మందికి జన్మనిచ్చింది. ఆమె పేరు ‘మరియం నబతాంజీ’. వయసు 39 ఏళ్లు. ఆమెకు జన్మించిన పిల్లల్లో ట్విన్స్‌ ఉన్నారు. ట్రిపులెట్స్‌ ఉన్నారూ.. క్వాడ్రప్లెట్స్‌ ఉన్నారు.. మొత్తం ఆరు జతల ట్విన్స్‌. నాలుగు జతల ట్రిపులెట్స్‌ ఉన్నారు. ఐదు జతల క్వాడ్రప్లెట్స్‌ ఉన్నారు. మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు.

ఆమెకే ఎందుకిలా జరిగిందంటే.. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్‌ పెద్దదిగా ఉండడమే దానికి కారణమట. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి.

ఉగాండాలో సంతానం ఎక్కువే. అయినప్పటికీ, మరియం నబతాంజీ కేసు చాలా ప్రత్యేకమైనది. దురదృష్టవశాత్తూ పిల్లల్ని పట్టించుకోకుండా, ఆమె భర్త కుటుంబానికి దూరమయ్యాడు. అప్పటి నుండీ, పిల్లల్ని తన స్వశక్తితోనే పెంచుతోందీ మహిళ. వాస్తవానికి ఇంతమంది పిల్లల్ని కనడం వెనక ఓ దీనగాధ కూడా ఉంది. నబతాంజీని చిన్నప్పుడే ఆమె తల్లి విడిచి పెట్టేసింది. తండ్రి మరో ఐదుగురు తోబుట్టువులతో ఉండాల్సి వచ్చింది నబతాంబీకి. అయితే, ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మొత్తం పిల్లలినందర్నీ చంపేయడానికి ప్లాన్‌ చేసింది. గాజును పొడిగా చేసి, ఆహారంలో కలిపి పెట్టింది. ఆ సమయంలో నబతాంజీ మాత్రమే బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో మిగిలింది. మిగతా ఐదుగురు పిల్లలూ చనిపోయారు.

అలా తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్‌ ఫ్లోర్‌ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు సాయం చేస్తుంటారు.

అందరిలోకీ పెద్దవాడు ఇవాన్‌ కిబుకా.. వయసు 23 ఏళ్లు. అమ్మ పడే కష్టం చూసి తట్టుకోలేకపోతున్నామనీ, తమ వంతుగా ఆమెకు రకరకాల పనుల్లో సాయం చేస్తుంటామనీ చెప్పాడు. నబతాంజీ హెయిర్‌ డ్రస్సింగ్‌, ఈవెంట్‌ డెకరేటింగ్‌, స్క్రాబ్‌ మెటల్‌ని సేకరించడం, అమ్మడం, లోకల్‌ జిమ్‌ తయారు చేయడం, హెర్బల్‌ మెడిసన్స్‌ని విక్రయించడం వంటి పనుల ద్వారా డబ్బు సమకూరుస్తుంటుంది. తద్వారా కుటుంబాన్ని నిర్వహిస్తుంటుంది.

1 COMMENT

  1. 663149 913755Aw, i thought this was quite a very good post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce a great article but exactly what do I say I procrastinate alot by no indicates manage to get something done. 279237

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...