Switch to English

డ్రైవింగ్‌ ఫోర్స్‌: మహిళలే మహరాణులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

సంసార సాగరాన్ని నడిపించే డ్రైవర్లు మహిళలే. ఆకాశంలో సగం. అన్నింటా సగం అని మహిళల గురించి చెబుతుంటాం కానీ, మహిళలు సగం కాదు, అంతకు మించి. భర్త సంపాదనను ఎలా ఖర్చుపెట్టాలి.. అందులోంచి ఎలా కొంత మిగిల్చి కుటుంబాన్ని ఇంకాస్త ముందుకు నడిపించాలి.. అని మహిళలు ఆలోచిస్తుంటారు. అలాంటి మహిళలు ఆఫ్ట్రాల్‌ వాహనాల్ని నడపలేరా.? పురుషాధిక్య సమాజంలో మహిళలపై ఉన్న కొన్ని ఆంక్షల కారణంగా, డ్రైవింగ్‌ ఫోర్స్‌ విషయంలో అతివలు కొంత వెనకడిన మాట వాస్తవమే. నిజానికి వాళ్లు వెనకబడలేదు. వాళ్లని వెనక్కి నెట్టేస్తున్నామంతే.

ఓ వ్యక్తి మహిళల్ని మహరాణులుగా మార్చడానికి ఓ బృహత్కార్యం చేపట్టాడు. అతని పేరు మన్సూర్‌ అలీఖాన్‌. ఆయన చేసిందల్లా ‘మక్కల్‌ పైలెట్‌’.. అనే విభిన్నమైన ఆలోచన. మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి వారిని పైలెట్స్‌గా మార్చాడు. ఎమ్‌.ఆటో అనే యాప్‌ ద్వారా వీరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. తమిళనాడులో ‘ఎమ్‌.ఆటో’ గురించి తెలియని వారు దాదాపుగా లేరేమో. 2017లో ఈ బృహత్‌ కార్యక్రమం ప్రారంభమైంది. మొదట 50 మంది మాత్రమే శిక్షణ పొందారు. ఇప్పుడు ‘ఎమ్‌.ఆటో’ పైలెట్ల సంఖ్య 330.

కులం, మతం, ప్రాంతం అనే బౌండరీలు కనిపించవిక్కడ. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు, కోయంబత్తూర్‌, మధురై, తిరుచ్చిలలో ఈ మహిళా పైలెట్లు సేవలందిస్తున్నారు. మరిన్ని ప్రాంతాలకు ఈ ఎమ్‌. ఆటో విస్తరించబోతోంది. ‘ఎమ్‌’ అంటే, ‘మక్కల్‌’.. దానర్ధం ప్రజలు అని. ఒక్కో మహిళా పైలెట్‌ రోజుకు 500 నుండి 3000 రూపాయల వరకూ సంపాదిస్తున్నారట. మరి మహిళలు కదా, సమస్యలేమీ ఎదురు కావడం లేదా.. అంటే, చిన్న చిన్న సమస్యల్ని పట్టించుకోకుండా, లక్ష్యం వైపు దూసుకుపోవడమే, తమ ఘనత అని చెబుతారు ‘ఎమ్‌ పైలెట్లు’.

‘ఎమ్‌.ఆటో’ కోసం తయారు చేసిన యాప్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రయాణీకులు పైలెట్‌ని ఎంచుకోవచ్చు. ఏదైనా కారణంతో ఎంచుకున్న పైలెట్‌ రాకపోతే, ఐదు, పది నిముషాల్లోనే మరో పైలెట్‌ మిమ్మల్ని గమ్య స్థానానికి చేర్చుతారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంది. ప్రమాద సమయాల్లో తక్షణ సాయం కోసం కూడా ఏర్పాట్లున్నాయి. మహిళా ప్రయాణీకులకు పూర్తి భద్రత కల్పిస్తోంది ఈ మక్కల్‌ ఆటో. ప్రయాణీకులు, పైలెట్లు ఇద్దరి భద్రతా ఈ ‘ఎమ్‌.ఆటో’ ప్రత్యేకత. పేద మహిళలే కాదు, విద్యాధికులైన నిరుద్యోగ మహిళలు కూడా ‘ఎమ్‌. ఆటో’ పైలెట్లుగా మారుతున్నారు. రోడ్లపై పోకిరీల బెడద తమనేమీ చేయలేదనీ, దీన్నొక పనిగా కాకుండా, గౌరవంగా భావిస్తున్నామనీ, మహిళా పైలెట్లు చెబుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...