Switch to English

జనం కోసం వనం – వన ‘శక్తి’ ఈ 105 ఏళ్ళ తిమ్మక్క

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

జీవితం మనకేమీ ఇవ్వకపోయినా, ప్రపంచానికి మన జీవితం ద్వారా ఏదో ఒకటి అందివ్వాలనే తపన ఓ మహిళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 105 ఏళ్ల వయసున్న ఆమె పేరు సాలు మరద తిమ్మక్క. దక్షిణ భారత దేశంలో ఓ మారుమూల గ్రామానికి చెందిన తిమ్మక్క పిల్లల కోసం చాలా కష్టపడింది. కానీ, దురదృష్టవశాత్తూ, ఆమెకు పిల్లలు కలగలేదు. దాంతో భర్త ద్వారా పిల్లలు కలిగే అవకాశం లేదని తెలిసి, తన జీవితంలో తనకంటూ పిల్లలు ఉండరని భావించి ఆమె ఎవరూ ఊహించని రీతిలో కొత్త ప్రయత్నం మొదలు పెట్టింది.

పిల్లల్ని పెంచినట్లే, మొక్కల్ని పెంచడం మొదలు పెట్టింది. సుమారు మూడు వందల నుండి నాలుగొందల వరకూ మర్రి చెట్లను పెంచారామె. అవిప్పుడు మహావృక్షాల్లా మారాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదలైంది తిక్కమ్మ పర్యావరణ ప్రయాణం. ప్రకృతి పట్ల ఆరాధనతో, భావి తరాల పట్ట బాధ్యతతో ఆమె చేసిన ఈ పనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ‘గుబ్బి’ అనే ఓ చిన్న గ్రామం నుండి తిక్కమ్మ తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. పదేళ్ల వయసులోనే ఆమెకు బిక్కాల చిక్కయ్య అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కడు పేదరికం కారణంగా చిన్న వయసు నుండే కూలి పని అలవాటైపోయింది తిక్కమ్మకు. 35 ఏళ్ల వయసు వచ్చే వరకూ భర్తతో పిల్లల కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. కానీ పిల్లలు కలగలేదు.

అంతే, తిక్కమ్మ ఆలోచన మారిపోయింది. పిల్లల కోసం ఆలోచించకుండా, తన భర్తతో కలిసి మొక్కల్లే పిల్లలుగా భావించి, భవిష్యత్‌ తరాలకు చెట్లను తమ వారసత్వంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. భర్త సహకారంతో తిక్కమ్మ వేలాది చెట్లను పెంచారు. 1991లో చిక్కయ్య తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత కూడా ఆమె ప్రయాణం కొనసాగింది.

ఇప్పటిదాకా 50కి పైగా జాతీయ, అంతర్జాయతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. తిక్కమ్మ వారసుడిగా ఉమేష్‌ అనే వ్యక్తి ‘సాలూమరల తిక్కమ్మ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014లో ఈ ఫౌండేషన్‌ ఏర్పాటయ్యింది. ప్రకృతి పరిరక్షణకు ఈ ఫౌండేషన్‌ ఎంతగానో కృషి చేస్తోంది. 2019 లో భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ‘పద్మశ్రీ ‘ పురస్కారాన్ని బహుకరించింది.

ప్రపంచ వ్యాప్తంగా 15 శాతం మందికి పైగా భార్యా భర్తలు ఇన్‌ఫెర్టిలిటీ (పిల్లలు లేకపోవడం) సమస్యతో బాధపడుతున్నారు. వారిలో కొందరైనా తిక్కమ్మ బాటలో పయనిస్తే, ప్రపంచ పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పు నుండి బయటపడినట్లే.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...