మొదటి నుంచీ జనసేన పార్టీ ఖచ్చితమైన ఆరోపణలు చేస్తోంది ‘టీడీపీ – వైపీపీ’ మధ్య ’60-40’ అవగాహన గురించి. ఆ ఆరోపణలే ఇప్పుడు నిజమని నిరూపితమవుతున్నాయి. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. ఉమ్మడిగా, జనసేన పార్టీపైనా, భారతీయ జనతా పార్టీపైనా విమర్శలు చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కేంద్రం, కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, జనసేన పార్టీని టీడీపీ విమర్శిస్తోంది. ఇంకోపక్క, ‘మా ఆలోచనలకు తగ్గట్టుగానే కేంద్రం వ్యవహరిస్తోంది..’ అని చెప్పుకుంటున్న వైసీపీ కూడా జనసేన పార్టీపై విరుచుకుపడుతోంది. ఇక్కడ టీడీపీ – వైసీపీ ఓ ఖచ్చితమైన అవగాహనతో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నట్లే కన్పిస్తోంది.
చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం వైసీపీ నానా యాగీ చేసింది.. టీడీపీని విమర్శించింది. ఇప్పుడేమో, వైసీపీని టీడీపీ విమర్శిస్తూ రాజకీయం చేస్తోంది. పార్టీలు అటూ ఇటూ అయ్యాయి.. నేతలు అటూ ఇటూ అయ్యారు తప్ప.. రాజకీయంలో ఏమాత్రం నాటకీయత తగ్గడంలేదు. కేంద్రం అమల్లోకి తెస్తున్న జాతీయ విద్యా విధానానికి సంబంధించి, జనసేన పార్టీకి క్రెడిట్ దక్కింది.. ఆ క్రెడిట్ కూడా కేంద్రమే కొంత మేర జనసేన పార్టీకి కట్టబెట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, జనసేన అధినేత ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి, ఇది జనసేన పార్టీ సాధించిన అతి పెద్ద విజయం. దురదృష్టవశాత్తూ తెలుగు మీడియాలో ఈ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. అఫ్కోర్స్, జనసేన పార్టీకి ప్రచార యావ లేదనుకోండి.. అది వేరే సంగతి.
జనసేన మీద టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా, వైసీపీ ఎంతగా అడ్డగోలు ఆరోపణలు చేసినా, జనసేన పార్టీ సిద్ధాంత బలమేంటో భారతీయ జనతా పార్టీకి బాగా తెలుసు. పైగా, ఇది పార్టీల పరమైన అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం, ఓ రాజకీయ పార్టీ అధినేత ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. అదీ ఓ ప్రాంతీయ పార్టీ.. అందునా, 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని గెలిచిన పార్టీ అధినేత ఆలోచనలకి విలువనివ్వడం చాలా చాలా గొప్ప విషయం. దీన్ని ఇటు టీడీపీగానీ, అటు వైసీపీగానీ జీర్ణించుకోలేకపోతున్నాయి.
ప్రజల సొమ్ముతో ప్రకటనలు గుప్పిస్తూ.. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రచారం చేసుకుంటున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. మంచి పనికి ప్రచారం అవసరంలేదు.. చిత్తశుద్ధి వుంటే చాలని జనసేన – బీజేపీ నిరూపించాయి. అదే టీడీపీ – వైసీపీలకు కంటగింపుగా మారినట్లున్నాయి. బీజేపీ – జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి ‘శిఖండులు’ ఆయా పార్టీల నుంచి ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే తమ ప్రయత్నాలు షురూ చేశాయట.
301305 616960Yay google is my king helped me to locate this wonderful website ! . 609628
964869 502919I believe this is one of the most significant information for me. And im glad reading your article. But want to remark on some common things, The web site style is ideal, the articles is actually fantastic : D. Excellent job, cheers 618761
310469 295612You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous capabilities and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 347816
864763 674160Deference to op , some superb entropy. 721188