Switch to English

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,726FansLike
57,764FollowersFollow

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా చాలా ప్రయత్నాలు చేశారు.. ఇంకా చేస్తూనే వున్నారు. టీడీపీ అను‘కుల’ మీడియా సంగతి సరే సరి.!
కానీ, పరిస్థితులు మారాయి. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ నేతలు ఒకరొకరుగా స్వరం మార్చుతున్నారు. సానుకూలంగా స్పందిస్తున్నారు.

చిన్నా చితకా ఇంకెవరైనా టీడీపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల అసహనంతో వుంటే, వారికీ బాలయ్య కామెంట్స్ తర్వాత జ్ఞానోదయం అవ్వాల్సి వుంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో చేపట్టనున్న వారాహి విజయ యాత్రకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అవడం, ఈ క్రమంలో న్యాయ నిపుణులతో చర్చోపచర్చల నేపథ్యంలో ఢిల్లీలోనే నారా లోకేష్ వుంటుండడంతో.. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం కీలక నిర్ణయాల్ని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. అందులో అతి ముఖ్యమైనది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం, వారాహి విజయ యాత్రలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనబోతున్నాయి బాలయ్య ప్రకటన నేపథ్యంలో.

మొత్తంగా కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన క్లీన్ స్వీప్ చేసే దిశగా, బాలకృష్ణ ప్రకటన దోహదపడనుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గ్రామ స్థాయిలో టీడీపీ – జనసేన శ్రేణులు ఇంత త్వరగా కలుస్తాయని బహుశా వైసీపీ ఊహించి వుండదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bigg Boss Telugu7: టిక్కెట్ టు ఫినాలే.! ఇంత సిల్లీగానా.!

మొదటి రౌండ్ కదా.. చాలా చప్పగా వుండడంలో వింతేముంది.? రెండో రౌండ్ కాస్త టఫ్‌గా మారింది.. ఆ తర్వాత ఇంకోటి.. ఇంకాస్త టఫ్.! అంతేనా.? ఇంకేమన్నా...

Animal: ‘యానిమల్ 3గంటల 21 నిముషాల మూవీ కాదు..’ రణబీర్ షాకింగ్...

Animal: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranabir Kapoor) హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న...

Family Star : రౌడీ స్టార్‌ మూవీ గురించి షాకింగ్ పుకారు

Family Star : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను...

Animal : హాయ్ నాన్న అనబోతున్న యానిమల్‌..!

ఈ మధ్య కాలంలో సినిమాలకు ఎంత వైవిధ్యంగా ప్రమోషన్‌ చేస్తే అంతగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. సినిమాకు చేసే పబ్లిసిటీని బట్టి ఓపెనింగ్‌ కలెక్షన్స్ మరియు...

Kriti Sanon : బన్నీ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ వెయిటింగ్‌

Kriti Sanon : అల్లు అర్జున్‌ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమాకి ముందు...

రాజకీయం

ప్రచారం ముగిసింది.! పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

అధికార బీఆర్ఎస్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఉధృతమైన ప్రచారం వుంటుందని ఊహించలేదు. నిజానికి, మిత్రపక్షం బీజేపీ కూడా జనసేన పార్టీ నుంచి ఇంతటి సహకారాన్నీ, పోరాట పటిమనీ ఊహించి...

కేసీయార్ గెలుపు.! ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓటమి.!

పోటీ చేసిన రెండు చోట్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గెలవబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అలాగే కామారెడ్డి నుంచీ కేసీయార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ మీద గజ్వేల్‌లో...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...

జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ‘జై’ కొట్టిన నారా లోకేష్.!

రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది. తెలంగాణలో అసెంబ్లీ...

యువగళం ఈసారి మరింత ప్రత్యేకం..! కానీ.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన యువగళం పాదయాత్ర,...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ విన్నర్ శివాజీనే.! మీకేమన్నా డౌటుందా.?

కాఫీ తాగలేదు గనుక, మైండ్ సరిగ్గా లేదట.! అందుకని, ప్రియాంకతో వాదన పెట్టుకోలేదట శివాజీ.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో ఓకింత కాంప్లికేటెడ్ కంటెస్టెంట్ ఎవరన్నా వున్నారంటే శివాజీనే. హోస్ట్...

Bigg Boss Telugu7: టిక్కెట్ టు ఫినాలే.! ఇంత సిల్లీగానా.!

మొదటి రౌండ్ కదా.. చాలా చప్పగా వుండడంలో వింతేముంది.? రెండో రౌండ్ కాస్త టఫ్‌గా మారింది.. ఆ తర్వాత ఇంకోటి.. ఇంకాస్త టఫ్.! అంతేనా.? ఇంకేమన్నా వుందా.! ఏమో, ఏం వుండబోతోందో.! గడియారం.. ఓ...

Trisha: ‘నన్ను క్షమించండి..’ త్రిషకు నటుడు క్షమాపణలు.. పోస్టు వైరల్

Trisha: దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష (Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ (Mansoor Ali Khan) క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...

Sandeep Reddy Vanga: యానిమల్ కథ మహేశ్ కు..! సందీప్ రెడ్డి క్లారిటీ

Sandeep Reddy Vanga: దేశవ్యాప్తంగా ప్రస్తుతం బజ్ క్రియేట్ అయిన సినిమా ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranabeer Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన...