Switch to English

టిబి విశ్లేషణ: కరోనా వ్యాక్సిన్ ఇండియాలో విజయవంతమవుతుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మామమ్మారిని లొంగదీసేందుకు పలు దేశాల్లో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రష్యా ఈ విషయంలో మొదటి టీకా తీసుకొచ్చినా దాని పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ ను చాలా హడావిడిగా తీసుకొచ్చారని, అందువల్ల అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూడాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు టీకా తయారీలో ఎన్ని దశలుంటాయి? కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇండియాలో ఎంతవరకు విజయవంతం అవుతుంది అనే విషయాలను చూద్దాం..

కోవిడ్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ఈ సంవత్సరాంతానికి లేదా 2021 మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే, కీలకమైన ఈ వ్యాక్సిన్ ను అందరికీ అందజేయడం కంటే దీని పరీక్షే చాలా తొందరగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఈ టీకాను త్వరగా అభివృద్ధి చేసినప్పటికీ.. దీని ప్రభావం, భద్రత, సరఫరాలపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 48 టీకాలను ప్రజలపై పరీక్షిస్తున్నారు. అలాగే ప్రీ క్లినికల్ దశలో 88 వ్యాక్సిన్లు ఉన్నాయి. అంటే వీటిని జంతువులపై ప్రయోగిస్తున్నారన్నమాట. కోవిడ్ మహమ్మారి పుట్టిన చైనాలో ఇప్పటికే 5 టీకాలను మానవులపై పరీక్షించి, అభివృద్ధి చేశారు. ఈ సంవత్సరాంతానికి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అక్కడి ప్రభుత్వ సంస్థ చెబుతోంది.

వ్యాక్సిన్ తయారీకి పట్టే సమయమెంత?

ఏ రోగానికైనా వ్యాక్సిన్ రూపొందించి, మార్కెట్లోకి విడుదల చేసే క్రమంలో పలు దశలుంటాయి. వీటన్నింటిని విజయవంతంగా పూర్తిచేసుకున్న టీకానే సమర్థవంతంగా పనిచేస్తుంది. నిజానికి ఒక టీకాను వంద రకాల కాంబినేషన్లలో తయారుచేసి అన్ని పరీక్షలు పూర్తి చేయడానికి కనీసం రెండు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. ఇందుకు దాదాపు 500 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.3694 కోట్లు) ఖర్చవుతుంది.

జీరో దశలో భాగంగా.. 15 మంది వ్యక్తులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. పరిశోధకులు చాలా చిన్న డోసును వారికి ఇస్తారు. ఒకవేళ అందులో ఆశించిన ఫలితాలు రాకుంటే ప్రి క్లినికల్ దశకు వెళ్లాలని నిర్ణయిస్తారు.

కరోనా వ్యాక్సిన్ ఇండియాలో విజయవంతమవుతుందా?

ప్రి క్లినికల్ దశలో 20 రకాల వ్యాక్సిన్లను ఎలుకలు, గీనియా పందులపై రెండేళ్లపాటు పరీక్షిస్తారు. జీవ ప్రతిస్పందనలో ఇవి మనుషుల తరహాలో ఉంటాయి కాబట్టి వీటినే పరీక్షల కోసం ఎంచుకుంటారు.

దీని తర్వాత ఒకటో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ దశలో పేర్లు నమోదు చేసుకున్న ఆరోగ్యకరమైన మానవ వాలంటీర్లలో 20 నుంచి 80 మందిని ఎంచుకుని పరీక్షిస్తారు. వారికి ఏదైనా ప్రతికూల ఫలితాలు వచ్చాయా? భద్రతాపరమైన ప్రమాణాలు ఎలా ఉన్నాయి వంటివాటిని పరిశీలిస్తారు.

అనంతరం రెండో దశ ట్రయల్స్ కు వెళతారు. ఇక్కడ కొత్త కాంబినేషన్లలో ఐదు రకాల వ్యాక్సిన్లను నిర్దేశిత మోతాదులో వాలంటీర్లకు ఇంజెక్ట్ చేసి, ఫలితాలు సమీక్షిస్తారు. ఇందుకోసం దాదాపు వంద లేదా అంతకంటే ఎక్కువ మంది వాలంటీర్లను వినియోగించుకుంటారు.

ఇక మూడో దశలో వ్యాక్సిన్ కాంబినేషన్ ను ఒకటికి తగ్గిస్తారు. అనంతరం అది రోగాన్ని నియంత్రిస్తుందా లేదా పరీక్షిస్తారు. ఇందుకోసం సాధారణంగా రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇది చాలా కీలకమైన దశ. వేలాది మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి.. మానవ శరీరంలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏవైనా ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా వంటి విషయాలను నిశితంగా గమనిస్తారు. సదరు టీకా భద్రత, సామర్థ్యం ఇక్కడే తెలుస్తుంది.

అనంతరం భద్రతాపరమైన ప్రమాణాలు, రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన, కొత్తగా అభివృద్ధి చేసిన టీకాల డేటా నివేదికలను ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత రెగ్యులేటరీ బాడీ, సంస్థాగత ఎథిక్స్ కమిటీలకు సమర్పిస్తారు. అనంతరం వాటిని సమీక్షించి, అనుమతి ఇవ్వడానికి మరో ఏడాది వరకు సమయం పడుతుంది.

ఇదంతా ఒక ఎత్తైతే.. టీకా తయారీ, డెలివరీ మరో ప్రహసనం. వ్యాక్సిన్ కు అనుమతి వచ్చిన తర్వాత వాటిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక నిపుణులు, ఖరీదైన సౌకర్యాలు కావాలి. నిజానికి ఇది మూడో దశలోనే ప్రారంభమవుతుంది. అక్కడ వేలాది మందికి ఈ టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వీటిని అందుకు తగినంత మొత్తంలో తయారుచేస్తారు.

ఇక చివరిదైన నాలుగో దశలో మార్కెట్లోకి టీకా విడుదలైన తర్వాత కూడా నిఘా ఉంటుంది. కొత్త వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత.. దానివల్ల మానవులలో ఏవైనా ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా వంటి విషయాలను రెగ్యులేటరీ బాడీ నిరంతరం పర్యవేక్షిస్తుంది.

ఒక్కోసారి టీకాను ప్రోటోకాల్ ప్రకారం తయారుచేయడానికి వ్యవధి ఉండకపోవచ్చు. అత్యవసరంగా దానిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఇలాంటి సమయాల్లో పరిశోధకులు వివిధ దశలను ఒకేసారి ఉపయోగించి త్వరితగతిన ఆమోదం పొందుతారు. వ్యాక్సిన్ ను త్వరగా అభివృద్ధి చేయడానికి ఇదో ప్రత్యామ్నాయ మార్గం. ప్రస్తుతం కొన్ని కరోనా టీకాలు ఒకటి, రెండు దశల్లో ఉన్నాయి. అంటే వీటిని తొలిసారిగానే వందలాది మందిపై ప్రయోగిస్తారు. దీనివల్ల పరిశోధన వ్యవధి మూడు నుంచి నాలుగేళ్లకు తగ్గుతుంది. అయితే, ఏడాదితో కూడా టీకా తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అది విజయవంతం అయినట్టు రుజువు కాలేదు.

కరోనా వ్యాక్సిన్ ప్రస్తుత పరిస్థితి ఇదీ…

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సంబంధించి 34 టీకాలు మొదటి దశలో ఉండగా 16 టీకాలు రెండో దశలో ఉన్నాయి. ఇక మూడో దశలో 11, చివరి దశలో పరిమితం వినియోగం కోసం 6 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఒకటో దశలో ఎంటోస్ ఫార్మా, ఇజ్రాయెల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ బయలాజికల్ రీసెర్చ్, ఇమ్యూనిటీ బయో, షెన్ జెన్ కంగ్ టై ఉన్నాయి. ఇనోవియో అనే డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ను అంగస్ అభివృద్ధి చేయగా.. భారత్ కు సంబంధించి జైడుస్ కాడిలా, థాయ్ ల్యాండ్ కు చెందిన చులా వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్, సనోఫీ తదితరాలు రెండో దశలో ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్ ఇండియాలో విజయవంతమవుతుందా?

ఇక జన్యు వ్యాక్సిన్లకు సంబంధించి కొన్ని ప్రీ క్లినకల్ దశలో ఉన్నాయి. వీటిలో అప్లైడ్ డీఎన్ఏ సైన్సెస్, ఎవివాక్స్ అండ్ టాకిస్ బయోటెక్, డియోసిన్ వ్యాక్స్, ఎలిక్జిరెన్ థెరప్యూటిక్స్, ఎథ్ ఆర్ఎన్ఏ, హెచ్ డీటీ బయో, ఇన్ఫెక్షస్ డిసీజ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అండ్ అమిరిస్, మెడిఫేజ్ బయోసూటికల్స్, ఓపెన్ కరోనా కన్సార్టియా వంటివి ఉన్నాయి. శరీరంలో వైరల్ ప్రొటీన్లను ఉత్పత్తి చేయడానికి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా మోడెర్నా మ్యాన్యుఫాక్చరర్స్ తయారుచేసిన వ్యాక్సిన్ ఇంకా విడుదల కాలేదు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ ఏడాది మార్చిలో కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఈ సంస్థ మానవులపై ప్రయోగించింది. ఇందులో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఇది మూడో దశలో ఉంది. ఇక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్.. క్రిస్మస్ కంటే ముందు అత్యవసర అనుమతి పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తుది పరీక్షలు జరుగుతున్నా.. పరిస్థితులు దృష్ట్యా అత్యవసర అనుమతి వచ్చే అవకాశం ఉంది.

మనదేశంలోకి వ్యాక్సిన్ ఎప్పడొస్తుంది?

భారత్ బయోటెక్ కు సంబంధించి కోవిడ్-19 వ్యాక్సిన్.. కోవాక్సిన్ ఒకటి, రెండో దశలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ ఏడాది జూలైలో అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ లో తమ వ్యాక్సిన్ ను విడుదల చేయాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. అయితే, క్లినికల్ ట్రయల్స్ వివరాలతోపాటు దేశంలో వ్యాక్సిన్ అత్యవసరం వినియోగం ఎంతవరకు ఉంది అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి ఐదు రోజుల క్రితమే భారత్ బయోటెక్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే భువనేశ్వర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో దీనికి సంబంధించి పరీక్షలు మొదలుకానున్నాయి. గతంలో మాదిరిగానే సగం మంది వాలంటీర్లకు ప్లేసిబో, మిగిలిన సగం మంది వాలంటీర్లకు కోవాక్సిన్ వేస్తారు. అలాగే భారత్ లో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ది చేయడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తున్న రెండు సంస్థల్లో అహ్మాదాబాద్ కు చెందిన కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ కూడా ఒకటి. మానవ క్లినికల్ ప్రయోగాలకు అనుమతి వస్తే.. సంబంధిత భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ఇది చర్చలు జరుపుతోంది. ఇది తన ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ కు సంబంధించి 5 కోట్ల నుంచి 7 కోట్ల అదనపు డోసులను తయారుచేసే సంస్థల కోసం చూస్తోంది. రెడిడెసివర్ ద్వారా కరోనా చికిత్సలు నిర్వహించిన కాడిలా.. టీకా పరీక్షలు నిర్వహిస్తున్న పలు భారత కంపెనీల్లో ఒకటి. ప్రస్తుతం ఈ టీకా రెండో దశలో ఉంది. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే.. డిసెంబర్ చివరి వారంలో దాదాపు 30వేల మందిపై క్లికికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. ఇందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సంస్థ ఎండీ ష్రావిల్ పటేల్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ ఇండియాలో విజయవంతమవుతుందా?

నిజానికి వ్యాక్సిన్ దశలకు సంబంధించిన ప్రాథమిక ఏడాతో ఈ టీకాను ఈ సంవత్సరాంతానికి లేదా 2021 మధ్యలో తీసుకొస్తామని వీటి తయారీదారులు ఎలా చెబుతున్నారో తెలియడంలేదు. ఐదు నుంచి ఆరేళ్లపాటు అభివృద్ధి చేసిన అనేక వ్యాక్సిన్లు గతంలో విఫలమైన విషయాన్ని ఇక్కడ గమనించాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఈ రెండు సంస్థలు కేవలం ఆరు నెలల క్రితమే తమ ప్రయోగాలు ప్రారంభించాయని గుర్తుచేస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో, జాడిల్లా మార్చి లేదా ఏప్రల్ నాటికి వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆ వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైనా.. ప్రభావవంతమైన ఫలితాలు చూపిస్తుందనడానికి ఎలాంటి భరోసా ఉండదని పేర్కొంటున్నారు. ఇలాంటి టీకాల మోతాదును పెద్ద జనాభాలో నిర్దేశిత సమయం మేరకు రెండు నుంచి మూడు సార్లు పంపిణీ చేసినప్పుడే.. అది విజయవంతమైందా లేక విఫలమైందా తెలుస్తుందని స్పష్టంచేస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...