తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మూడవ స్థానంలో నిల్చున్నా కూడా విజేతకు దక్కినంత క్రేజ్ సోహెల్ కు దక్కింది అనడంలో సందేహం లేదు. ఆ క్రేజ్ తో ఒకేసారి రెండు మూడు సినిమా ఆఫర్లు కూడా సోహెల్ దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లో అవకాశం గురించి సోహెల్ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. ఇప్పటికే సోహెల్ ను వీడియో స్కాం పేరుతో జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎంట్రీ బ్యాక్ డోర్ అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కారణం ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే.
తనకు మాటీవీలో పని చేసే ఒక అన్న తెలుసు. ఆ అన్నను చాలా రిక్వెస్ట్ చేస్తే నాకు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది. చాలా కాలంగా ఆ అన్నను అడుగూ వస్తున్నాను. అన్నను చాలా విసిగించగా చివరకు ఒక రోజు అన్న నీకు అవకాశం వచ్చింది అంటూ ఫోన్ చేశాడు. ఆ అన్న వల్లే నేను బిగ్ బాస్ కు వెళ్లాను అంటూ పేర్కొన్నాడు. దాంతో సోహెల్ అవకాశం వచ్చి కాకుండా దక్కించుకుని పోయాడా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోహెల్ చేసిన ఈ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రికమండేషన్ తో చాలా మందే బిగ్ బాస్ లోకి వెళ్తారని దీంతో అర్థం అయ్యింది.
793917 88891This really is a excellent subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This write-up probably wont do properly with that crowd. I will be certain to submit something else though. 115057