Switch to English

మీడియాలో లొల్లి: టీవీ9 నుంచి సింగారావు ఔట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

తెలుగు న్యూస్‌ ఛానల్స్‌ రంగంలో టీవీ9 ఓ సంచలనం. అగ్రగామి న్యూస్‌ ఛానల్‌గా తెలుగునాట తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న టీవీ9 ఈ మధ్య ఇంకోరకమైన వార్తలతో మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది. గతంలో టీడీపీ అనుకూల వైఖరి అందుకున్న టీవీ9, ఆ తర్వాత వైసీపీ – టీఆర్‌ఎస్‌ అనుకూల వైఖరిని అందుకుందనే విమర్శల్ని మూటగట్టుకుంది.

ఆ సంగతి పక్కన పెడితే, టీవీ9లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ ఛానల్‌ నుంచి రవిప్రకాష్‌ బయటకు వచ్చిన విషయం విదితమే. రవిప్రకాష్‌ బయటకు వచ్చేశాక, టీవీ9 ఇమేజ్‌ క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. కరోనా మరింతగా దెబ్బకొట్టింది. ఈ గందరగోళం నడుమ కీలక వ్యక్తి గొట్టిపాటి సింగారావు (చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌) ఆ ఛానల్‌ నుంచి బయటకు వచ్చేస్తుండడం గమనార్హం.

ఛానల్‌లో అంతర్గతంగా ఏర్పడ్డ సమస్యల నేపథ్యంలో సింగారావుపై ఒత్తిడి పెరిగిందనీ, దాంతో ఆ ఒత్తిడిని భరించలేక ఆయన బయటకు వచ్చేస్తున్నారనీ తెలుస్తోంది. టీవీ9 నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు కూడా. గతంలో పలు ఛానళ్ళలో పనిచేసిన సింగారావు, ‘కీలకమైన వ్యవహారాల్లో’ అత్యంత కీలకమైన వ్యక్తిగా బాధ్యతలు నిర్వహించారు. అలాంటి సింగారావు, టీవీ9కి దూరమవడం ఆ సంస్థకు చాలా పెద్ద దెబ్బ.. అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోపక్క, రాజకీయ ఒత్తిళ్ళు కూడా సింగారావు టీవీ9 నుంచి బయటకు రావడానికి కారణమన్న గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. ‘రాజకీయాల్లో నడిచే రాజకీయాల కంటే, మీడియా రంగంలో రాజకీయాలు ఇంకా ఆసక్తికరం..’ అంటూ ఆ రంగంలోని రాజకీయాలపై సాధారణ ప్రజానీకానికీ ఆసక్తి ఏర్పడుతోంది. కొన్ని ఛానల్స్‌లోని అంతర్గత వ్యవహారాలైతే, ‘ద్రి¸ల్లర్‌’ సినిమాల్ని తలపిస్తుంటాయనే చర్చ మీడియా వర్గాల్లో ఎప్పటినుంచో నడుస్తోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి..’ పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ అందం..

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ఓ రకుల్’ అని పాట పాడుకోవాలేమో ఆమె అందాన్ని చూసి. చురకత్తిలాంటి చూపులు.. ఓరకంట కవ్వింపులు.. మత్తెక్కించే...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం...

రాజకీయం

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

ఎక్కువ చదివినవి

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

Kalki: ‘క్లీంకార’కు బుజ్జి గిఫ్ట్స్ పంపిన కల్కి టీమ్.. ఉపాసన పోస్ట్ వైరల్

Kalki: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల తనయ ‘క్లీంకారా’కు కల్కి టీమ్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ సినిమా నుంచి ఇటివలే బుజ్జి వెహికల్ లాంచ్...

Pushpa 2: ‘సూసేకీ..’ పాట డ్యాన్స్ స్పెషల్ గా డిజైన్ చేసింది అందుకే: గణేశ్ ఆచార్య

Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 15న విడుదలవుతోన్న పుష్ప 2 నుంచి...

ఏమైందో అర్థం కావడం లేదు.. సీఎం జగన్ భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సంక్షేమ పథకాలే తమకి మరోసారి అధికారం కట్టబెడతాయని ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం రామోజీ రావు ఉంటారు అనడంలో సందేహం...