సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,164FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం లేదు. అకిరానందన్ కూడా దాన్ని ఇష్టపడడు..’ అంటూ అకిరానదన్ తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో చెప్పడం, పవన్ కళ్యాణ్ అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు.

‘జూనియర్ అన్న ప్రస్తావన’ సర్వసాధారణం. చిరంజీవి కొడుకు, జూనియర్ చిరంజీవి.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు, జూనియర్ అక్కినేని.. ఇది సహజమైన ప్రస్తావనే. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ అయితే, అక్కినేని తనయుడ్ని యువ సమ్రాట్‌గా అభిమానులు పిలుచుకోవడం.. తెలిసిన విషయమే.

కింగ్ అక్కినేని నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇలా కాలక్రమంలో అన్నీ మారుతుంటాయ్. ఇంతకీ, సినిమాలపై అకిరానందన్‌కి ఆసక్తి వుందా.? లేదా.? వుండకుండా ఎందుకుంటుంది.? తల్లి రేణు దేశాయ్ సినీ నటి, తండ్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడు. సో, అకిరానందన్ కూడా సినిమాల్లోకి ఖచ్చితంగా వస్తాడు.

మరి, జనసైనికులేంటీ, ‘అకిరానందన్.. నువ్వు రాజకీయాల్లోకి వచ్చెయ్..’ అంటున్నారు.? అది జనసైనికుల అభిమానం మరి.! ‘నాన్నగారికి తోడుగా రాజకీయాల్లో నువ్వుంటే బావుంటుంది..’ అంటూ జనసైనికులు, సోషల్ మీడియా వేదికగా అకిరానందన్‌ని కోరుతుండడం ఒకింత ఆశ్చర్యకరమే.

ఎన్నికల్లో గెలిచాక, కుమారుడు అకినందన్‌ని వెంటేసుకుని, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యలయానికి చేరుకున్నారు జనసేనాని. అక్కడే, తన కుమారుడిని టీడీపీ అధినేత చంద్రబాబుకి జనసేనాని పరిచయం చేశారు. అంతే కాదు, ఢిల్లీకి తన కుమారుడిని తీసుకెళ్ళి, ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేశారు జనసేనాని.

వాస్తవానికి, ఇవన్నీ మర్యాదపూర్వక భేటీలే.! ఇదీ నా కుటుంబం.. అని జనసేనాని, ‘కొంతమందికి’ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

అకిరానందన్ ఇంకా చిన్న పిల్లాడు. చదువుకుంటున్నాడు. సినిమాకి సంబంధించి చాలా నేర్చుకోవాల్సి వుంది. సినిమాలపై అతనే నిర్ణయం తీసుకోవాలి. ఇక, రాజకీయాలంటారా.? ఇప్పుడైతే ఆ ప్రస్తావన అనవసరమే అనిపిస్తుంది. కానీ, రాజకీయాలపై అతనికి ఆసక్తి వుంటే.. ఏమో, ఏదైనా జరగొచ్చు.

739 COMMENTS

సినిమా

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

రాజకీయం

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

ఎక్కువ చదివినవి

విరోష్ రిసెప్షన్‌కి ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం

ఇండియాలోనే అత్యంత క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్‌గా నిలిచిన విరోష్ వివాహ వేడుకలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ నెల 4న సాయంత్రం విజయ్...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్ చరణ్

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్ లా బ్లాస్ట్ అయింది. ప్రతిఒక్కరూ రామ్...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...