Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ఓ రకుల్’ అని పాట పాడుకోవాలేమో ఆమె అందాన్ని చూసి. చురకత్తిలాంటి చూపులు.. ఓరకంట కవ్వింపులు.. మత్తెక్కించే ఒంపుసొంపులు.. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) లో పొదిగిన సొబగులు. నాజూకైన నడుము.. అందమైన శరీర సౌష్టవం.. కుర్రకారుకు కైపెక్కించే కవ్వింపులు ఆమె సొంతం. అందుకే రకుల్ కి పెళ్లైనా ఆమెలో ఏమాత్రం తగ్గని అందం.. కూల్ కూల్ అనిపిస్తోంది. అందుకే ఆమె ఫొటోషూట్స్ అంటే కుర్రకారుకి క్రేజ్.
నిత్యం యోగా, వ్యాయామం చేసే రకుల్ ఓ నాజూకు సన్నజాజి తీగ. కవ్వించే నాభి అందాలతో కైపెక్కిస్తుంది. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ తో బీచ్ సాంగ్ లో రకుల్ అందాలకు ఫిదా అయిపోయారు కుర్రాళ్లు. ఆమె ఫిట్ నెస్ మంత్ర అదే. మోడ్రన్ డ్రెస్ వేసినా.. సంప్రదాయ దుస్తులే ధరించినా.. మల్లిజాజి తీగలా ఉండే రకుల్ వయ్యారాలకు ఎవరైనా ఫిదా కావల్సిందే. మోడలింగ్ కెరీర్లో బికినీలో రకుల్ అందాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అంతగా స్లిమ్ అండ్ ఫిట్ తన సొంతం.
నిత్యం ఫొటోషూట్స్ తో తన అందాన్ని ఎంతగా కాపాడుకుంటుందో చెప్పకనే చెప్తుంది రకుల్. లేటెస్ట్ గా బ్లూ జీన్స్, ఆరెంజ్ కలర్ టాప్ లో రకుల్ పర్ఫెక్ట్ లుక్స్ తో అదరగొడుతోంది. ఇందుకు ఆమె నడుము వయ్యారాలు.. నాభి అందం బోనస్. తన చూపులతోనే హొయలు ఒలకించే రకుల్ ఇక మత్తెక్కించే డ్రెస్సింగ్.. కైపెక్కించే చూపులు తోడైతే నిద్రలు పడతాయా. ప్రస్తుత పిక్స్ కి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫుల్లీ లోడెడ్ బ్యూటీ అంటూ కొనియాడుతున్నారు.