Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 15న విడుదలవుతోన్న పుష్ప 2 నుంచి ఇటివల వచ్చిన పాటలు అలరిస్తున్నాయి.
ఇటివలే వచ్చినే ‘సూసేకీ..’ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. పాటకు కొరియోగ్రఫీ అందించిన గణేశ్ ఆచార్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘సూసేకీ..’ పాట చాలా రిచ్ గా ఉంటుంది. మీరు చూసిన లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే ఉంది. పాటలో అందం.. డ్యాన్స్ చూడాలంటే సినిమాలోనే. 500లకు పైగా డ్యాన్సర్స్ పాల్గొన్నారు. 8రోజులు షూటింగ్ చేశాం’.
‘ఫ్యామిలీస్ కూడా సులభంగా డ్యాన్స్ చేసేలా హుక్ స్టెప్ డిజైన్ చేశా. బన్నీ-రష్మిక జోడీ డ్యాన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంద’ని అన్నారు. పుష్పలోని ఊ.. అంటావా పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన గణేశ్ ఆచార్యనే పుష్ప 2లో కూడా మరో పాటకు కొరియోగ్రఫీ చేయనున్నారు. ఓ బాలీవుడ్ నటి ఇందులో నటించనున్నట్టు తెలుస్తోంది.
