Switch to English

ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలు..! ఈవోకు తెలిసే అక్రమాలు..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భక్తుల కొంగు బంగారమైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. కక్కుర్తికి పోయి సిబ్బందే చూపిస్తున్న చేతి వాటం భక్తుల విశ్వాసంపై దెబ్బ కొడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మ దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తులెందరో. అలా వచ్చి అమ్మకు భక్తితో సమర్పించే కానుకలను కూడా బొక్కేయడం.. ఉన్నతాధికారుల అండదండలు ఉండటం.. తీవ్రంగా పరిగణించే అంశం. ఇంద్రకీలాద్రిపై ఇన్ని ఆరోపణలకు మూలం ఎవరంటే ఈవో సురేశ్ బాబు వైపే వేళ్లు చూపిస్తున్నాయి.

 

కొండపై ఏసీబీకి తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. అమ్మవారి పట్టుచీరల విషయంలో సిబ్బంది చేసిన అక్రమాలు సంచలనం రేపాయి. దుర్గమ్మకు భక్తులు సమర్పించే ముఖ్యమైన కానుకలు పట్టుచీరలు. వాటిలోనే ఎక్కువ అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. చీరలను రికార్డుల్లో నమోదు చేయకుండా పక్కన పెట్టినట్టు గుర్తించారు. చీరలు విక్రయించిన ధరలకు, బార్ కోడింగ్ ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. 15 వేల చీరలను 2,500లకే కొనుగోలు చేశారు సిబ్బంది. 7వేలు, రూ.3500 విలువ చేసే చీరలు దాదాపుగా లెక్కల్లో లేవు. కౌంటర్లో ఉండాల్సిన చీరలు బీరువాల్లో ఉన్నాయి.

 

వేలు, లక్షలు ఖరీదు చేసే చీరల్లో సిబ్బందే తక్కువ ధరకే కొనుగోలు చేసినట్టు చూపి దోచేశారని తేలింది. ఇన్ని అక్రమాలు ఈవో సురేష్ బాబుకు తెలిసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈవోపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవే కాకుండా కొండపై కోట్లాది రూపాయల అవినీతిని ఏసీబీ బయటపెట్టింది. ప్రసాదం, సరుకుల కొనుగోళ్లు, దర్శనం టికెట్లు, సెక్యూరిటీ టెండర్లు, శానిటైజేషన్ కాంట్రాక్టులు.. ప్రతి అంశంలోనూ అవినీతే. టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్ల చెల్లింపులపై ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఈవో సురేష్ బాబు పట్టించుకోలేదని తేలింది.

 

రూల్స్ కు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కాంట్రాక్టులు.. ఈ-టెండర్ల విషయంలో తక్కువ సొమ్ముకే కోట్ చేసిన స్పార్క్ కంపెనీని కాదని.. మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ని అక్రమాలకు ఈవో సురేష్ బాబే కారణమనే ఆరోపణలున్నాయి. ఇన్ని అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం ఈవోను బదిలీ చేసింది కానీ.. సస్పెండ్ చేయలేదనే విమర్శలూ వస్తున్నాయి. మరి.. ప్రభుత్వం ఈ అంశంపై ఏస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...