రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపుతోంది. ప్రస్తుతం మరో అరుదైన రికార్డుతో ఆర్ఆర్ఆర్ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అతపెద్దదైన ఐమాక్స్ ధియేటర్లో అందుబాటులో ఉంచిన సెకన్లలోనే టికెట్లన్నీ అమ్ముడైపోయి సత్తా చాటుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ గా భావించే లాస్ ఏంజెల్స్ లోని టీసీఎల్ చైనీస్ ధియేటర్’ లో జనవరి 9న ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలో ఆన్ లైన్లో టికెట్లు ఉంచిన 98 సెకన్లలోనే 932 టికెట్లు బుక్ అయి రికార్డు నెలకొల్పింది. దీంతో.. విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకుల అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమవుతోంద.
ఇప్పటికే జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్ల రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పలు అవార్డులు ఆర్ఆర్ఆర్ సొంతమయ్యాయి.
842605 63630I was suggested this site by my cousin. Im not confident whether this post is written by him as no 1 else know such detailed about my trouble. You are fantastic! Thanks! xrumer 676699
434765 440528Excellently written post, doubts all bloggers offered exactly the same content material because you, the internet is actually a greater place. Please keep it up! 516299