Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)-ఉపాసన (Upasana) దంపతులు మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో వారిద్దరూ కలిసి పార్టీలు, ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, పండుగల సమయాల్లో కలిసున్న ఫొటోలు అభిమానులనే కాకుండా నెటిజన్లను కూడా ఆకర్షిస్తూంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance) అధినేత ముఖేశ్ అంబానీ (Mukhesh Ambani) తనయుడు అనంత్ అంబానీ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో వీరిద్దరూ ప్రత్యేక విమానంలో వెళ్లారు. అయితే.. ప్రయాణంలో ఉపాసన అలసిపోయి నిద్రపోతుంటే.. రామ్ చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ ఆమెకు సాంత్వన చేకూరుస్తున్నారు.
ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కు బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇవ్వాలని కొందరు.. క్యూటెస్ట్ కపుల్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్-ఉపాసన ఒకరికొకరు చూపే ప్రేమ ఆయా ఫొటోలు, వీడియోల్లో కనిపిస్తూంటుంది.
Beautiful love ❤️❤️ @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/YwD3z1ISCc
— Team Chiru Vijayawada (@SuryaKonidela) March 2, 2024