అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ ఎందుకు వీడలేదు.? బాబాయ్ హత్య జరిగితే, ఇంతవరకు నిందితులెవరో తేల్చలేకపోయారంటే మీ సమర్థత ఏంటి.? అంటూ జగన్ సర్కార్‌ని కడిగి పారేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో.
జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపుని కాంక్షిస్తూ తిరుపతిలో పాదయాత్ర నిర్వహించిన పవన్, అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు బీజేపీ నేతలు సునీల్ దేవధర్, రత్నప్రభ తదితరులు. పవన్ నటించిన సినిమాల్లోని డైలాగులూ చెప్పారు. గబ్బర్ సింగ్ సినిమాలోని లెక్క.. తిక్క డైలాగ్‌ని సునీల్ దేవధర్ చెబితే, గోపాల గోపాల సినిమాలోని.. కొన్నిసార్లు ఆలస్యమైనా.. రావడం మాత్రం పక్కా.. అనే డైలాగ్‌ని రత్నప్రభ చెప్పారు.
పవన్ కళ్యాణ్‌ని తన తమ్ముడిగా అభివర్ణించారు రత్నప్రభ. దేవాలయాలపై దాడులు జరిగినా, దోషుల్ని పట్టుకోలేకపోయిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థనీ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ‘సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు కదా.. మీ టెక్నాలజీ గొప్పతనమేంటి.?’ అని పోలీసు వ్యవస్థని ప్రశ్నించారు పవన్. ‘151 మంది గూండాలు..’ అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
‘కోట్లు కొల్లగొడుతున్నారు.. దోచుకుంటున్నారు..’ అంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డ పవన్, ప్రజలు ప్రశ్నించలేకపోతే.. వ్యవస్థలు ఇలాగే వుంటాయని అన్నారు. ‘ఈ బహిరంగ సభ కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన యువత.. రాజకీయాల్లో మార్పు కోసం నడుం బిగించాలి.. ధైర్యంగా నిలబడాలి.. అలాగని ఎవరి మీదా దాడులకు వెళ్ళొద్దు.. ఓటు అనే ఆయుధంతో అవసరమైనప్పుడు గట్టిగా నిలబడండి..’ అని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
‘వైసీపీకి ఓటేస్తే, వెంకటేశ్వరస్వామికి వెన్నుపోటు పొడిచినట్లే..’ అంటూ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ప్రజల్ని ఉ్దదేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘రాయలసీమ నుంచి నాయకులు ఎదుగుతున్నారు.. కోట్లు గడిస్తున్నారు.. రాయలసీమ ప్రాంతం మాత్రం అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడిందంటే లోపమెక్కడుందో గుర్తించాలి..’ అని ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్.
444784 335770Fascinating, but not perfect. Are you going to write more? 737944
385300 516189Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall appear of your internet web site is amazing, let alone the content! 636264
650919 884751This web page is often a walk-through its the internet you wanted about this and didnt know who to question. Glimpse here, and youll totally discover it. 736873