Switch to English

పోలవరం అంచనా వ్యయం పెరిగిందోచ్.. కేంద్రం ఏమంటుంది చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరోమారు పెరిగింది. అందునా, కేవలం ప్రధాన డ్యామ్ అంచనా వ్యయమే భారీగా.. అంటే, సుమారు 1600 కోట్ల రూపాయల మేర పెరగడం గమనార్హం. అదేంటీ.? రివర్స్ టెండరింగ్ పేరుతో భారీగా వ్యయాన్ని ఆదా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కదా.? అంటే, అదంతే. 2016 నాటి అంచనా వ్యయానికీ, 2021 నాటి అంచనా వ్యయానికీ తేడా వుంటుంది కదా.? అప్పటికీ ఇప్పటికీ జరిగిన పనులెంత.? జరగాల్సిన పనులెంత.? ఈ అంచనా వ్యయాల పెంపు గోలేంటి.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సామాన్యుల మెదళ్ళను దోచేస్తున్నాయి.

ఓ పక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం, ఇవ్వాల్సిన నిధులే ఇవ్వడంలేదు. చంద్రబాబు హయాంలోనే మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 55 వేల కోట్లుగా తేలితే, కేంద్రమూ ఆమోదించింది. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సవాలక్ష కొర్రీలు తెరపైకొచ్చాయి. వివాదం ఎలాగోలా సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో మళ్ళీ కొత్త అంచనా వ్యయాల వ్యవహారం తెరపైకొచ్చింది. మరిప్పుడు, ఈ పెరిగిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.

ప్రాజెక్టులు అన్నాక.. అంచనా వ్యయాలు పెరుగుతూ వుంటాయి.. దానిక్కారణం, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. 2018 చివరి నాటికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు. కానీ, అది జరగలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందంటూ ఓ అంచనాకి వచ్చారు. కానీ, అదీ జరగలేదు. అంచనా వ్యయాలు పెరగడం తప్ప, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థతే కనిపించకపోవడానికి కారణమేంటి.?

ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం వీడేదెప్పడు.? జాతీయ ప్రాజెక్టు అయినా, పోలవరం ప్రాజెక్టు.. ఏడేళ్ళలో పూర్తి కాలేదంటే, అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? తెలంగాణ రాష్ట్రం రికార్డు సమయంలో సొంతంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసుకుంది. నిజానికి, పోలవరం ప్రాజెక్టుతో పోల్చితే, కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చు చాలా చాలా ఎక్కువ. ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులున్నారు తప్ప, రాష్ట్రం కోసం పనిచేసే నాయకులు లేరని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...