Switch to English

అబ్జర్వేషన్‌.. బీజేపీతో జనసేన హనీమూన్‌ ముగిసినట్లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ హనీమూన్‌ ముగిసిందా.? అంటే అవుననే చర్చ ఇరు పార్టీల్లోనూ జరుగుతోంది. జనసేనతో పొత్తు ప్రకటన ఓ తొందరపాటు చర్యగా ఇప్పటికే బీజేపీలో ఓ వర్గం బలంగా నమ్ముతోంది. జనసేన పార్టీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాలంటే, అందుకు జనసేన పార్టీ తప్ప ఇంకో దారి లేదన్న ఆలోచనతో బీజేపీ అధిష్టానం అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ని తనవైపుకు తిప్పుకున్న విషయం విదితమే.

వైఎస్సార్సీపీతోపాటు, తెలుగుదేశం పార్టీతోనూ సమదూరం పాటించే క్రమంలో వామపక్షాల మద్దతు సరిపోదన్న ఆలోచనతో, బీజేపీ వైపుకు జనసేనాని చూసిన మాట కూడా వాస్తవం. అయితే, బీజేపీలో ఓ వర్గం టీడీపీతోనూ, ఇంకో వర్గం వైఎస్సార్సీపీతోనూ అంటకాగుతోంది. ‘ఆ రెండు పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు’ అని బీజేపీ ఖచ్చితమైన హామీ ఇవ్వడంతోనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీకి మద్దతు ప్రకటించారు.

అయితే, శాసన మండలి సాక్షిగా బీజేపీ వైసీపీకి పరోక్ష మద్దతు ప్రకటించిన విషయం విదితమే. అదే సమయంలో, బీజేపీలోని మరికొందరు నేతలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ గందరగోళం నడుమ ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళినా, ఢిల్లీ పెద్దల నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి ‘స్ట్రెయిట్‌గా’ సమాధానం దొరకలేదట. దాంతో, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీని పక్కన పెట్టడమే బెటర్‌.. అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరోపక్క, జనసేననే తాము వదిలించుకోవాలనుకుంటున్నట్లు బీజేపీ సంకేతాలు పంపుతోంది. బీజేపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు.. ఆ వ్యూహాల ముందు నిలబడటం జనసేనకు అంత తేలిక కాదు. ఆ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ నెల 28న జరగాల్సిన మీటింగ్‌ రద్దయ్యింది.. ఫిబ్రవరి 2న జరగాల్సిన లాంగ్‌ మార్చ్‌ వాయిదా పడింది.. బహుశా బీజేపీ – జనసేన పొత్తు రద్దుపై కొద్ది రోజుల్లోనే ప్రకటన రావొచ్చేమో. అదే మంచిదని జనసైనికులూ తమ అభిప్రాయాన్ని అధినేతకు వివరిస్తున్నారట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...