Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవర సినిమా రూపొందుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాల్సి ఉంది.
తాజాగా దేవర సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం దేవర సినిమాను జులై లేదా ఆగస్టు లో విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
కొందరు వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి కొందరు మాత్రం ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి మరియు పార్లమెంట్ కి ఎన్నికలు ఉన్న కారణంగా వాయిదా వేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇంతకు ఏ కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వాయిదా కచ్చితంగా వారికి బ్యాడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.