Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ స్పీడ్ చూస్తూ ఉంటే సినిమాను కచ్చితంగా ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోందని ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు.
ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పుష్ప 2 సినిమా రిలీజ్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుష్ప 2 ను డిసెంబర్ కి రీ షెడ్యూల్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు అనేది పెద్ద పుకారు. పుష్ప 2 సినిమాను రీ షెడ్యూల్ చేస్తున్న కారణంగానే ఎన్టీఆర్ దేవర సినిమాను ఆగస్టు లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పుష్ప 1 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే పుష్ప 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
కనుక దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని మరీ రూపొందిస్తున్నాడు. అందుకే కాస్త ఆలస్యంగానే సినిమా విడుదల అవ్వబోతుంది. పుష్ప 1 సినిమా డిసెంబర్ లో వచ్చింది. కనుక పుష్ప 2 కూడా డిసెంబర్ లో వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.