Switch to English

పక్షులకు నిజంగా నారాయణుడే: లక్షలు వెచ్చించి వాటి దాహం తీరుస్తున్నాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఈ భూమి మీద మనుషులు ప్రాణాలతో ఉండాలంటే పక్షులు కూడా ప్రాణాలతో ఉండాల్సిందే. భూమి మీద జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయడానికి పక్షుల అవసరం ఎంతో ఉంది. కానీ అలాంటి పక్షుల రక్షణకు మనిషి ఏమైనా చేస్తున్నాడా? కనీసం వేసవిలో వాటి దాహార్తి తీర్చడానికైనా ప్రయత్నిస్తున్నాడా? ఎవరికి వారు బిజీబిజీగా గడుపుతూ ప్రస్తుత ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. ఇక పక్షులను పట్టించుకునే పరిస్థితి ఎక్కడుంది? కానీ కేరళ ఎర్నాకుళం జిల్లాలోని ముత్తాడం గ్రామానికి చెందిన 70 ఏళ్ల శ్రీమాన్ నారాయణన్ మాత్రం నాకెందుకులే అనుకోలేదు.

వేసవిలో గుక్కెడు నీళ్ల కోసం మనమే ఎంతో అల్లాడుతున్నాం.. అలాంటిది పక్షుల పరిస్థితి ఏమిటి అని ఆలోచించి, వాటికి అండగా నిలవాలని భావించారు. వాస్తవానికి పక్షులు చెరువులు లేదా నదుల్లో నీటిని తాగి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. అయితే, వేసవిలో చెరువులు ఎండిపోతాయి. ఇక ఎర్నాకుళం పరిధిలో ఉన్న పెరియార్ నది పూర్తి కాలుష్యంతో నిండిపోవడంతో ఆ నీటిని తాగిన పక్షులు చనిపోతున్నాయి. దీంతో వాటికి నీటిని అందుబాటులో ఉంచాలని నారాయణన్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.6 లక్షలు వెచ్చించి 10 వేల మట్టిపాత్రలు కొనుగోలు చేశారు. ఊళ్లోవారందరికీ వాటిని పంచిపెట్టి, తమ ఇంటి వద్ద పక్షుల కోసం నీటిని ఉంచాలని కోరారు. అలా వేసవిలో పక్షుల దాహార్తిని తీరుస్తూ వాటికి నారాయణుడిగా మారారు.

రచయిత కూడా అయిన నారాయణన్.. లాటరీ హోల్ సేల్ డీలర్ గా పనిచేస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగం పక్షుల కోసమే వినియోగిస్తున్నారు. ‘‘నా ముగ్గురు పిల్లల పట్ల నా బాధ్యతను నెరవేర్చాను. ప్రస్తుతం వారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇకపై నాకు వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తు కోసం దాచాలని అనుకోలేదు. ప్రస్తుతం నాశనమైతున్న భూమిని వదిలేసి, భవిష్యత్తు కోసం సంపాదన దాయడంలో అర్థం లేదు. లాటరీ వ్యాపారం, నాకున్న చిన్న రెస్టారెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్షుల కోసం వెచ్చిస్తున్నా’’ అని నారాయణన్ తెలిపారు. ఒక్క మట్టిపాత్రలో ఉంచిన నీళ్లు కనీసం 100 పక్షుల దాహాన్ని తీరుస్తాయని ఆయన వెల్లడించారు.

ప్రజలకు మట్టి పాత్రలు పంచే కార్యక్రమాన్ని గతేడాదే ఆయన ప్రారంభించారు. అది బాగా విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా 10వేల పాత్రలు కొనుగోలు చేసి ప్రజలకు పంచిపెట్టారు. అంతేకాకుండా రూ.15 లక్షల విలువైన 50వేల మొక్కలను ఎర్నాకుళం జిల్లా మొత్తం గతేడాది పంపిణీ చేశారు. ఆ మొక్కలు పెరిగి పళ్లు కాసిన తర్వాత వాటిలో కొన్నింటిని పక్షుల కోసం చెట్లపైనే ఉంచేయాలనే షరతుతో వాటిని జనాలకు పంచిపెట్టారు.

గాంధీజీ జీవితంతో స్ఫూర్తి పొందిన శ్రీమాన్ నారాయణన్.. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. గత ఆరేళ్లుగా గాంధీజీ సిద్దాంతాలు, ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా గాంధీజీకి సంబంధించిన పుస్తకాలను అందరికీ పంచుతూ ఉంటారు. పైసా లాభాపేక్ష లేకుండా సమాజానికి ఎంతో సేవ చేస్తున్న నారాయణన్ కు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి ఆయనకు సరిగ్గా సరిపోతుంది. పక్షుల కోసం, ప్రకృతి కోసం ఆయన పడుతున్న తపన చూస్తే.. హ్యాట్సాఫ్ నారాయణన్ జీ అనకుండా ఉండలేం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...