న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు టక్ జగదీష్ విడుదల కోసం వేచి చూస్తూనే మరోవైపు శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇది. శ్యామ్ సింగ రాయ్ పూర్తిగా బెంగాల్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం.
ఈ సినిమా షెడ్యూల్ బెంగాల్ లో జరుగుతుండగా అక్కడ ఎన్నికల వేడి పెరగడంతో షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకుని తాజా షెడ్యూల్ ను పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నాని, సాయి పల్లవిల కాంబినేషన్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
437338 867266Over and more than again I like to take into consideration this problems. As a matter of fact it wasnt even a month ago that I thought about this really thing. To be honest, what is the answer though? 846125
358212 515888Great information, greater still to locate out your blog that has a fantastic layout. Nicely done 810750