Switch to English

కత్తులు వదలి.. కట్టలు చేతికి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

రాజకీయ క్రీడలో కీలకమైన ప్రచారపర్వానికి నేటి సాయంత్రంతో తెరపడింది. రోజు తన మాటలతో అన్ని పార్టీల వారు కత్తులు దూసుకున్న సంగతి తెలిసిందే. ఇక మాటల కత్తులు పక్కన పడేసి ఇప్పుడు నోట్లకట్టలు చేతికి పట్టుకున్నారు. ప్రచార పర్వం ముగియడానికి ముందే ఎక్కడికక్కడ నోట్లకట్టలు వరదలా పారుతున్నాయి. ఫలానా పార్టీ అన్న తేడా లేకుండా అందరూ ఓటుకు నోటును చాలా పకడ్భందీగా పాటిస్తున్నారు. కొంతలో కొంత జనసేన డబ్బుల విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నా.. ప్రధానా పార్టీలు మాత్రం ఓటుకు 1500 నుంచి 5000 దాకా పంపకాలు సాగిస్తున్నారనే వార్తలు జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. నువ్వు వెయ్యి అంటే ఆ వెంటనే నాది రెండువేలు అన్నట్లుగా పంపకాలు సాగుతున్నాయట. చాలాచోట్ల డబ్బు రూపంలో కష్టం అవుతుందని ఒకే కుటుంబానికి ఎకమొత్తంగా లెక్కగట్టి తమకు తెలిసిన వారి షాపులో వారికి కావలసిన వస్తువులు తీయిస్తున్నారట. మరికొన్ని చోట్ల చీరలు, ముక్కుపుడకలు సంఖ్యను బట్టి వస్తువుల పరిణామం మారుతూ ఉందట. ఇలా సాగుతోంది ఎన్నికల సమరం.

వైసీపీలో తిరిగి ఆత్మవిశ్వాసం

గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో చాలాచోట్ల తప్పుల మీద తప్పులు చేసిన జగన్‌ ఇప్పుడు పకడ్భందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పలు సర్వేల్లో కూడా వైసీపీదే అధికారం అంటున్న వేల వారు ఉత్సాహంతో ఉన్నా.. గత ఎన్నికల లాగా దెబ్బ తినకూడదని.. ఇప్పుడు వీళ్లు కూడా డబ్బు పంపకాల విషయంలో ఎక్కడికక్కడ పోటీ పడుతున్నారట. గత టర్మ్‌లో బాగా దెబ్బకొట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈసారి చాలా వ్యూహాలు రచించి మరీ ఆ పార్టీ నాయకులు ముందుకు పోతున్నారు. ఎన్నికలకు చాలా మునుపే ఖర్చు విషయంలో వెనుకాడకుండా దూసుకుపోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి ఖచ్చితంగా పని చేస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు. ఎంత కాదనుకున్నా దాదాపు 120 నుంచి 135 సీట్లు గెలుస్తామని.. అది లేదంటే ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేస్తామనే ధీమా వారిలో కనిపిస్తోంది. జగన్‌ కూడా చాలాకాలంగా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగారు. చూడాలి మరి ఈసారైనా అధికార పీఠం దక్కుతుందా..? లేక అందని ద్రాక్షలా మిగులుతుందా అన్నది.

టీడీపీ చివరి అస్త్రాలు పనిచేస్తాయా?

ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో చంద్రబాబును మించినవారు లేరని చెప్పకతప్పదు. గత టర్మ్‌లో ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా తన మేధస్సుకు పనిచెప్పి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబును చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని.. సరిగ్గా ఎన్నికల ముందర అన్నివర్గాల వారికి తాయిలాలు ప్రకటించడంతో పాటు… రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేశారు. పసుపు కుంకుమ, వృద్యాప్య పెన్షన్‌లు చాలావరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు మీద మాత్రం మేధావి వర్గాల్లో ఇప్పటికీ నమ్మకం ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని వైసీపీకి గెలుపు అంత సునాయాసం కాదని అంటున్నారు. చూడాలి మరి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుని ముఖ్యమంత్రిగా అవుతారో లేక ఇంటికి పరిమితం అవుతారో.

జనసేన ఆశలు సజీవం..

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా తన వ్యూహాలు తాను రచిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయన కొంతవరకు డబ్బున్న వారిని నమ్ముకున్నా.. ఎక్కువశాతం తన జనసైనికులనే నమ్ముకున్నారు. అభిమానులు కూడా తమ హీరో కొడితే జాక్‌పాట్‌ కొడతారనే నమ్మకాన్ని మాత్రం వ్యక్తంచేస్తూ ఉన్నారు. కీలకమైన మేధావి వర్గాలు ఉండేచోట బలమైన, నమ్మకమైన వారిని నిలబెట్టడంతో చాలావరకు సీట్ల విషయంలో ఎమైనా జరగొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన పవన్‌.. ఆ వర్గంవారు చాలామటుకు పవన్‌కు అనుకూలంగా నిలబతున్నారు. ఒకప్పటి చిరు వేరు తమ్ముడు వేరనే అభిప్రాయాన్ని కలిగించడంతో ఈయన్ను ఒకసారి చూద్దామనే స్వంత సామాజికవర్గం కూడా చాలాచోట్ల గట్టిగా పావులు కదుపుతూ ఉంది. చూడాలి మరి పవన్‌ అదృష్టం ఏమేకు ఉందో.

కాంగ్రెస్‌, వామపక్షాల ఉనికి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో వారిని పెద్దగా ప్రస్తావణలోకి తీసుకోవడం లేదు. అదృష్టం కలిసివస్తే.. ఒకటో ఆర దక్కుతాయనే ఆశలు వారిలో కూడా ఉన్నాయి. మునుపటితో పోల్చుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా కాస్తాంత కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో ఎలాగూ బహిరంగం ఒప్పందం ఉంది కాబట్టి వారు గెలిచినా ఓడినా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎటోచ్చి అన్ని పార్టీలు గెలుపు మాదంటే మాది అనే ధీమాను వ్యక్తపరుస్తున్నాయి. ఏ విషయం అయినా ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే,

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

యంగ్ హీరోతో హీరో అర్జున్ కూతురి వివాహం..

స్టార్ యాక్షన్ హీరో అర్జున్( Arjun Sarja) కూతురు ఐశ్వర్య(Aishwarya Arjun) వివాహం.. ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా...

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత...

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది....

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు...

రాజకీయం

పోయినోళ్ళంతా మంచోళ్ళే.! రామోజీ కూడా అంతే.!

పెద్దలు ఓ మాట చెబుతుంటారు.. ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అని.! అలాగని, పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే, ‘పోయారు’ కదా, వాళ్ళ గురించి ‘మంచి’ మాట్లాడుకోవడం బెటర్.! వాళ్ళు చేసిన...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీల్లో మెగాస్టార్...

నేటి పంచాంగం: తేదీ 09- 06-2024, ఆది వారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు

సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు. తిథి: శుక్ల తదియ సా 4.06 వరకు, తదుపరి చవితి. నక్షత్రం: పునర్వసు రాత్రి 9.24 వరకు, తదుపరి పుష్యమి. దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13వరకు. శుభ...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

వైసీపీ కార్యకర్తలు వర్సెస్ వాలంటీర్లు.. పార్టీ ఓటమికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 'వై నాట్ 175' అన్న నినాదంతో ఎన్నికల్లోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పరాజయానికి కారణాలు...

Balakrishna : బర్త్‌ డే స్పెషల్‌ : డబుల్‌ హ్యాట్రిక్ బాలయ్య

Balakrishna : నందమూరి బాలకృష్ణ... ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న బాలయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు...