సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు.
తిథి: శుక్ల తదియ సా 4.06 వరకు, తదుపరి చవితి.
నక్షత్రం: పునర్వసు రాత్రి 9.24 వరకు, తదుపరి పుష్యమి.
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13వరకు.
శుభ సమయం: మ.2.00 నుంచి 4.00 వరకు.
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: ఆనందంగా గడుపుతారు. ఆలోచించి పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడి పొందుతారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం.
వృషభ రాశి: అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పెద్దలు సలహా తీసుకోవడం మంచిది. ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. తోబుట్టువుల సహకారం ఉంటుంది.
మిథున రాశి: ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహా పాటించండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకపోవడం మంచిది.
కర్కాటక రాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బదిలీ కోరుకునే ఉద్యోగులకు మంచి సమయం. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేముందు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.
సింహరాశి: ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్య మళ్ళీ రావచ్చు. పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. కుటుంబ సమస్యలతో కలత చెందుతారు. గిట్టని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
కన్యారాశి: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. తండ్రితో విభేదాలు రావచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పై అధికారుల మెప్పు ఉంటుంది.
తులారాశి: అనుకూల ఫలితాలు పొందుతారు. మీ ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు. ఈ రాశి వారి పిల్లలకు నూతన ఉద్యోగ సూచనలు ఉన్నాయి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండడం వల్ల భారీ నష్టాల నుంచి బయటపడతారు.
వృశ్చిక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోబుట్టువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కీలక సమయాల్లో కుటుంబ పెద్దల సలహా ఉపయోగపడుతుంది. సహోద్యోగుల మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశి: తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. పిల్లల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో చిన్నపాటి నష్టం సంభవించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంటి పెద్దల సలహా పాటించడం మంచిది. రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది.
మకర రాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా కార్యాలయంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈరోజు ఉపశమనం కలుగుతుంది. సమస్యలను తండ్రితో పంచుకోవడం వల్ల పరిష్కారమవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి చిన్నపాటి అప్రమత్తత అవసరం.
కుంభరాశి: సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త పదవులు అందుకునే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా వారికి బాధ్యతలు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అనుకూల సమయం.
మీన రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. గిట్టని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు మరింత కష్టపడాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.