Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. సినిమా, రాజకీయాలు, వ్యవస్థలను సైతం ప్రభావితం చేయగల సామర్ధ్యం ఆయన సొంతం. ప్రభుత్వాలు మారతాయి.. నాయకులు మారతారు.. సీఎంలూ మారతారు.. వారి హోదాలూ మారతాయి. కానీ.. చిరంజీవి ప్రభ దశాబ్దాలుగా వెలుగుతూనే ఉంది. మెగాస్టార్ హోదా దేదీప్యమానం.
చిరంజీవి పేరే ఓ గౌరవం..
ఏపీ ఎన్నికల్లో కూటమి (జనసేన-టీడీపీ-జనసేన) విజయం సాధించింది. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎందరో అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. అయితే.. సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని ‘విశిష్ట అతిథి’గా ఆహ్వానించారు చంద్రబాబు. ఇది చిరంజీవి అభిమానులకి సంబరం. తెలుగు ప్రజలకు ప్రత్యేకం. కారణం.. చిరంజీవి అనే పేరే ఓ సేలబుల్ నేమ్.. గౌరవం.. ఆకర్షణ. చిరంజీవిని పిలిచారా.. చిరంజీవి వచ్చారా.. చిరంజీవి ఎక్కడ..? సగటు తెలుగు ప్రజ నుంచి వచ్చే సాధారణ మాట. అంతగా చిరంజీవి తన ప్రభావం తెలుగు నేలపై చూపారు.
సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ..
అందుకే వేదిక.. కార్యక్రమం ఏదైనా.. చిరంజీవి ఉంటే అదొక అందం. సినిమాల నుంచి విశిష్ట వ్యక్తిగా ఆహ్వానం అందుకోవాలంటే స్ఫురించే పేరు చిరంజీవి మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో చిరంజీవికి అవమానం జరిగిందనేది వాస్తవం. అంతటి హీరో నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం దక్కలేదనే బాధ మెగాభిమనుల్లో ఉండి పోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారి ఓ నేత సీఎం అవుతుంటే.. ప్రమాణ స్వీకారానికి ‘విశిష్ఠ అతిథి’గా ఆహ్వానం అందుకున్నారు చిరంజీవి. అదీ ఆయన స్థానం.. స్థాయి అని ఫ్యాన్స్ ముచ్చటపడున్నారు. 9ఏళ్లు సినిమాలకు దూరం.. మళ్లీ సినిమాల్లోకి వస్తే అదే ప్రజాదరణ. అందుకే ఎవరికైనా చిరంజీవిని ఆహ్వానించడం సాధారణం కాదు.. వారికి వారు ఇచ్చుకునే ఓ గౌరవం.