Switch to English

అన్నిచోట్లా నేనే అభ్యర్థిని అనుకోండి: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఐదు సంవత్సరాల క్రితం అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని, తనపై విశ్వాసంతో పసిబిడ్డ వంటి రాష్ట్రాన్ని ప్రజలు తనకు అప్పజెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఐదేళ్లు ఎంతగానో కష్టపడ్డానని స్పష్టంచేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాష్ట్రంలో ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. విభజన నాటి నుంచి నేటి వరకు నెలకొన్న కష్టనష్టాల్ని అందులో ఏకరువు పెట్టారు.

విభజన హామీలు నెరవేరుస్తానని చెప్పి కేంద్రం మోసం చేసిందని.. ఉమ్మడి రాష్ట్ర వాటాలో మన వాటా ఇవ్వకుండా తెలంగాణ అడ్డం తిరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్వశక్తిని నమ్ముకుని ముందుకు నడిచినట్టు చెప్పారు. పాదయాత్రలో పేదల కష్టాలు చూశానని, ఆపన్నులందరికీ సంక్షేమం అందించేందుకు రోజుకు 18 గంటలపాటు కష్టపడి సంపద సృష్టించినట్టు వివరించారు. పేదల కష్టాలు తెలిసిన పెద్ద కొడుకుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే తన కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవించేందుకు రుణమాఫీ, పింఛన్లు, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, పెళ్లికానుక, చంద్రన్న బీమా వంటి పథకాలు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చానని, గత ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నామని, వాటిపై పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచే భవిష్యత్తు సౌధాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు, కుట్రలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఎదుగుతోందని, అలాంటి పసికందును ఆర్థిక నేరగాళ్ల చేతిలో పెట్టగలమా అని ప్రశ్నించారు. 31 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తికి ఈ బిడ్డను అప్పచెప్పి ఆ పసికందు భవిష్యత్తును చిదిమేద్దామా అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కథను ప్రస్తావించారు. ‘‘ఒకసారి అడవిలో నాయకత్వానికి సెలయేరు, గొడ్డలి పోటీ పడ్డాయట. అందరి సంక్షేమాన్ని చూసే సెలయేరు కావాలా? చెట్లన్నీ అడ్డంగా నరికే గొడ్డలి కావాలా? అనే మీమాంస ఏర్పడిందట. కొన్ని చెట్లు గొడ్డలి కర్రది మన కులం కదా.. నాయకుడిగా పెట్టుకుంటే తప్పేంటి అనుకున్నాయట. ఆ చెట్ల మాటలను మరో చెట్టు మీద నుంచి ఆసక్తిగా వింటున్న కుందేలు మధ్యలో కలగజేసుని ఇలా అందట.. మన మధ్య ఏ భేదం చూపకుండా అందరి సంక్షేమమే తన కులం అని భావించి సేవచేసే సెలయేటిని వదిలి.. అడ్డంగా నరికే గొడ్డలి కర్రను మీ కులమని ఓటేస్తే చెట్లన్నింటినీ నరికేసి చివరికి అడవి అంతరించిపోతే మన భవిష్యత్తు ఏం కాను? అని అందట. దాంతో అడవిలో చెట్లన్నింటికీ జ్ఞానోదయమై చెట్లన్నీ పచ్చగా ఉండాలంటే మన నాయకుడిగా సెలయేరు ఉండాలని ఎన్నుకున్నాయట. అడవిలో చెట్లన్నింటికీ బాధ్యతను గుర్తు చేసిన ఆ కుందేలు మాటలు మన అందరికీ ఆదర్శం కావాలి’’ అని లేఖలో బాబు పేర్కొన్నారు.

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ప్రజలే ప్రాణంగా బతికానని, రాష్ట్ర అభివృద్ధి కోసం దేశాలు కాళ్లరిగేలా తిరిగానని వెల్లడించారు. గతంలో తన ట్రాక్ రికార్డు మీరు చూశారని, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ప్రస్ఫుటంగా కనిపించేలా అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో అక్కడక్కడా పొరపాట్లు జరిగి, కొంతమంది ఇబ్బంది పడినా పట్టించుకోవద్దన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో తానే అభ్యర్థినని భావించి ఓట్లు వేయాలని కోరారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టంచేశారు. అవినీతిపరులు, అరాచకవాదులకు అధికారం అప్పగిస్తే రాష్ట్రం నాశనమైపోతుందని హెచ్చరించారు. అలాంటివారిని మీ ఓటుతో బుద్ది చెప్పి, తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం కోసం తనకు అండగా నిలవాలని కోరారు.

Click Here for Letter

3 COMMENTS

  1. 428792 493319Beging with the entire wales well before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the similar to some with the shell planking along with far more significant damage so that they project soon after dark planking. planking 82341

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....