బీజేపీలో నరేంద్ర మోడీని వ్యతిరేకించేవారు ఎవరైనా వుంటారా.? నరేంద్ర మోడీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించేవారెవరైనా బీజేపీలో వుండగలుగుతారా.? ఛాన్సే లేదు.!
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కావొచ్చు, ఆయన ఆలోచనలకు భిన్నంగా కావొచ్చు.. కేంద్ర మంత్రి వర్గంలోనూ ఎవరూ వ్యవహరించరు, వ్యవహరించలేరు. అలాంటప్పుడు, కేంద్ర దర్యాప్తు సంస్థల విషయంలో మోడీకి తెలియకుండా బీజేపీలో ఇంకెవరో అత్యుత్సాహం చూపుతారని ఎలా అనుకోగలం.?
బెంగల్ సీఎం మమత వ్యూహాత్మక రాజకీయం.!
కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ దాడుల వెనుక ప్రధాని మోడీ వున్నారని తాను అనుకోవడంలేదనీ, బీజేపీలోని ఓ వర్గంం నేతలు తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
మోడీ మీద కొత్తగా మమతా బెనర్జీకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని అనుకోవాలా.? లేదంటే, బీజేపీలో చీలిక తెచ్చేందుకే మమత వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా.? రెండోదే కరెక్ట్.! కాగా, సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని విపక్ష నేత సువేందు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎవరు ఔనన్నా ఎవరుకాదన్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నాగానీ, దర్యాప్తు సంస్థల్ని తమ కనుసన్నల్లో నడుపుతుంటారు.. అదీ తమ రాజకీయ అవసరాల కోసం. ప్రత్యేకించి తమ రాజకీయ ప్రత్యర్థుల మీదకే ఆయా దర్యాప్తు సంస్థల్ని కేంద్రంలో అధికారంలో వున్నవారు ఉసిగొల్పడం కొత్తేమీ కాదు.
చిత్రమేంటంటే, సీబీఐ అలాగే ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని తమ మీదకు మోడీ ఉసిగొల్పుతున్నారని కేసీయార్ లాంటి నాయకులు విమర్శిస్తోంటే, అలాంటివారితో రాజకీయంగా సన్నిహిత సంబంధాలు నడుపుతున్న మమతా బెనర్జీ, ప్రధాని మోడీకి దాంతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం.
501439 422266Hey! I basically wish to give an enormous thumbs up for the great information youve got here on this post. I will likely be coming back to your blog for a lot more soon. 318516
597155 420622magnificent publish, very informative. 332017
276306 769079I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 438567