Switch to English

చిరంజీవికి మరో సెంటిమెంట్ హిట్ మూవీ… హిట్లర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అయిదు ఫైట్లు, ఆరు పాటలు.. ప్రేక్షకులకు అదే చిరంజీవి సినిమా. కామెడీ, ఫైట్లు, డ్యాన్సులతో తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన ముద్ర అలాంటిది. కథ ఉన్నా చిరంజీవి కోసమే ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. అలా.. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే.. ఒక ఇమేజ్ చట్రంలో ఇమిడిపోయిన చిరంజీవికి ఓదశలో ఇదే ఇబ్బందులు తెచ్చింది. వరుస ఫ్లాపులు రావడంతో కొత్త పంథాలో వెళ్లాల్సిన అవశ్యకాన్ని గుర్తించారు. అలా కథా బలంతో చిరంజీవి అందుకున్న సూపర్ హిట్ ‘హిట్లర్’. చిరంజీవి నుంచి తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం ఊహించని సెంటిమెంట్, ఐదుగరు చెల్లెళ్లకు అన్నగా నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్ అయ్యారు. కానీ.. చిరంజీవి వారిని మెప్పించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ‘హిట్లర్’ సూపర్ హిట్ అయింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సెంటిమెంట్ మూవీ ‘హిట్లర్’

చెల్లెళ్ల సెంటిమెంట్.. బరువైన పాత్ర..

చెల్లెలి సెంటిమెంట్ తో అప్పటికి చిరంజీవి చాలా సినిమాలే చేసినా.. ఆయన మార్కు మాస్ ఎలిమెంట్స్ ఉండేవి. కానీ.. హిట్లర్ మూవీలో చిరంజీవిది బరువైన పాత్ర. కష్టాలు, కన్నీళ్లు, చెల్లెళ్లు ఆయనపై ఎదురుతిరిగే పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోకు భిన్నమైన పెద్ద తరహా పాత్ర. చిరంజీవి నుంచి మేనరిజమ్స్, మాస్ డైలాగ్స్ ఆశించేవారికి ‘ఎదురు దెబ్బలు తినీ తినీ బండబారిపోయిన గుండెమ్మా ఇది’, ‘ఈరోజుతో నీకూ నాకూ చెల్లిపోయింది’, ‘చెల్లలివి నీ నుదుటి బొట్టు నేను చెరిపేస్తానా’.. వంటి బరువైన డైలాగులతో మాధవరావు పాత్రలో చిరంజీవి జీవించి ప్రేక్షకులను మెప్పించారు. సెంటిమెంట్ కథ, బరువైన పాత్రయినా తగ్గేదేలేదని నిరూపించారు. చిరంజీవితో తొలిసారిగా కీలకపాత్రలో దాసరి నారాయణరావు నటించారు. సపోర్టింగ్ పాత్రలో రాజేంద్రప్రసాద్ సినిమాలో కీలకంగా నిలిచారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సెంటిమెంట్ మూవీ ‘హిట్లర్’

చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టిన ముత్యాల సుబ్బయ్య..

ఎడిటర్ మోహన్ తమ ఎంల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్లో మళయాళ హిట్ హిట్లర్ ను అదే పేరుతో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. చిరంజీవి ఇమేజ్ కు భిన్నంగా సెంటిమెంట్ సినిమాలు తీసే సుబ్బయ్య.. చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కోటి సంగీతంలోని పాటలు అన్నీ హిట్టే. ముఖ్యంగా అబీబీ.. పాటలో చిరంజీవి ఐకానిక్ స్టెప్ కు ఫ్యాన్స్ ఊగిపోయారు. సెంటిమెంట్, పాటలు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేశాయి. హీరోయిన్ గా రంభ గ్లామర్ ఆకట్టుకుంటుంది. సినిమాలో చిరంజీవి మేనరిజమ్ ‘అంతొద్దు.. ఇది చాలు’ బాగా పాపులర్ అయింది. 1997 జనవరి 4న విడుదలైన సినిమా మంచి వసూళ్లు రాబట్టి 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. శతదినోత్సవ వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. హిట్లర్ విజయం చిరంజీవి మళ్లీ వరుస హిట్లకు నాంది పలికింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...