‘మంగళవారం’పై మాకు అందుకే కాన్ఫిడెన్స్ వచ్చింది : నిర్మాతలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,386FansLike
57,764FollowersFollow

‘మంగళవారం’ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్‌ పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా… నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వాతి, సురేష్ వర్మ మీడియాతో మాట్లాడారు.

స్వాతి గారు… మీ కుటుంబం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఉంది. ఈ సినిమా రంగంలో మీరు రావడం కొంచెం ఆలస్యమైందా?

స్వాతి రెడ్డి గునుపాటి : ఆలస్యం అయ్యిందని అనుకోను. ఇంతకు మించి పర్ఫెక్ట్ టైమింగ్ మాకు కుదిరేది కాదేమో!? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. ఎందుకంటే… ఇంత మంది ఓ సినిమా ఎలా చేస్తారని నాలో క్యూరియాసిటీ ఉంది. ఓ ఐడియాను ఎంతో మంది నమ్మి కష్టపడతారు. మాటీవీలో చేరినప్పుడు సురేష్ వర్మ గారిని ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నా. మాటీవీలో ఉండగా సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని ఆయనతో చెప్పాను. ఆయనకూ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన నా కంటే సీనియర్. చేస్తే కలిసే చేయాలనుకున్నాం. నేను లేకుండా ఆయన చేయలేదు. ఆయన లేకుండా నేను సినిమా చేయలేదు. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది.

‘మంగళవారం’తోనే ఎందుకు నిర్మాతగా మారారు? దీని కంటే ముందు ఏవైనా కథలు విన్నారా?

సురేష్ వర్మ : ‘మంగళవారం’ కంటే ముందు రెండు మూడు కథలు విన్నామంతే! ‘ఆర్ఎక్స్ 100’ టైంలో అజయ్ భూపతి ‘మంగళవారం’ కథ నాకు చెప్పారు. ఎగ్జైట్ చేసిన కథ ఇది. అజయ్ ఏమో తన సొంత సంస్థలో చేయాలని అనుకున్నాడు. ఆ మధ్యలో నేను కూడా కొందరు నిర్మాతలకు అజయ్ దగ్గర మంచి కథ ఉందని చెప్పా. స్వాతి గారికి అజయ్ దగ్గర కథ గురించి చెబితే… ‘విందాం! రమ్మనండి’ అని అడిగా.
స్వాతి రెడ్డి : మధ్యలో కథలు విన్నప్పటికీ… నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. అంతా డెస్టినీ! అలా కుదిరింది.

అల్లు అర్జున్ కథ విని ఓకే అన్నాక ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందా?

స్వాతి : నేను అప్పటికి 80 పర్సెంట్ అనుకున్నా. నాలో కాన్ఫిడెన్స్ ఉంది. అయితే అల్లు అర్జున్ వల్ల సినిమా చేయాలనే ధైర్యం వచ్చింది. ‘ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెయ్. చేసినప్పుడు నీతో ఎవవరైనా పార్ట్నర్ ఉంటే బావుంటుంది’ అని చెప్పాడు. సురేష్ వర్మ గారికి కూడా సేమ్ డ్రీమ్ ఉండటంతో ఇద్దరం కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం.

బన్నీతో మీ బాండింగ్ ఎప్పుడు మొదలైంది?

స్వాతి : చాలా ఏళ్ళ క్రితమే. ‘మా టీవీ’ కంటే ముందు నుంచి మేం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఉంది. మేం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే… నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాలి’ అని మా హెచ్ఓడి కండిషన్ పెట్టారు. నాన్నను రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ గారికి చెప్పమని అడిగా. ఆ టైంలో బెంగళూరు మా కాలేజీలో ఫెస్ట్ కి బన్నీ వచ్చారు. అప్పటి నుంచి మేం చాలా క్లోజ్ అయ్యాం. బన్నీ వైఫ్ స్నేహకి నేను క్లోజ్. మా ఆయన ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్. అలా మరింత దగ్గర అయ్యాం.

మీకున్న నేపథ్యానికి పెద్ద హీరోలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్టార్ హీరోలతో సినిమాలు చేయవచ్చు. ‘మంగళవారం’ చేయడానికి కారణం?

స్వాతి : నిర్మాతగా అడుగులు వేస్తున్నప్పుడు పెద్ద ప్రెజర్ పెట్టుకోవడం కంటే చిన్న సినిమా చేయడం మంచిదని అనుకున్నా. కథకు ప్రాముఖ్యం ఇస్తూ టీమ్ వర్క్ ఉండేలా సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాకు వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు.

కమర్షియల్ సినిమా, లవ్ స్టోరీ చేయడం కంటే డార్క్ థ్రిల్లర్ ఎలా వస్తుందో ఊహించడం కష్టం కదా!

స్వాతి : ఈ జానర్ ఫిల్మ్ చేయాలని అనుకోలేదు. కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తా. థ్రిల్లర్స్ తక్కువ. అజయ్ భూపతి గారి నేరేషన్ విని ‘ఈ మూవీ చేస్తే బావుంటుంది’ అనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్… అన్నీ ఉన్నాయి.
సురేష్ వర్మ : డార్క్ థ్రిల్లర్ అయినప్పటికీ… ఈ సినిమాలో ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ముందు నుంచి రెగ్యులర్ సినిమా చేయాలని మేం అనుకోలేదు. అదీ ఈ సినిమా చేయడానికి ఓ కారణం! ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది.

ఫేస్ మాస్క్ డిజైన్ ఐడియా ఎవరిది?

సురేష్ వర్మ : అజయ్ భూపతి ఐడియా అది. ‘కాంతార’కు ముందు కథ చెప్పాడు. ఆ టైంలో మాస్క్ గురించి చెప్పాడు. ఎన్నో స్కెచ్లు వేయించి చివరికి ఈ మాస్క్ ఓకే చేశాం. దర్శకత్వం మాత్రమే కాకుండా చాలా బాధ్యతలు చూసుకున్నారు. బాగా హ్యాండిల్ చేశాడు. అందువల్ల, మా మీద ఒత్తిడి లేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేశాం. కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశాడంతే!
స్వాతి : అజయ్ భూపతికి మేం ఫ్రీడమ్ ఇచ్చాం. అయితే… ప్రతిదీ మాకు చెప్పి, మా సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. మేం ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నాం.

అల్లు అర్జున్ నుంచి సలహాలు ఏమైనా వచ్చాయా?

స్వాతి : బన్నీని అజయ్ భూపతి కలిసినప్పుడు నేను లేను. తర్వాత ఫోనులో నేను మాట్లాడా. ‘ఆర్ఎక్స్ 100’ కల్ట్ ఫిల్మ్. ‘మహాసముద్రం’ కూడా బన్నీకి ఇష్టం. అజయ్ భూపతి డైరెక్షన్ సెన్స్ ఇష్టం.

ఆయనకు సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు?

స్వాతి : (నవ్వుతూ…) అల్లు అర్జున్ షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ రోజు కూడా షూటింగ్ నుంచి డైరెక్టుగా వచ్చారు.
సురేష్ వర్మ : ఫస్ట్ డే నుంచి అల్లు అర్జున్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో ఎగ్జైట్ అయ్యారు.

‘మంగళవారం’ నిర్మాణంలో మీరు నేర్చుకున్న విషయాలు?

స్వాతి : మంచి దర్శకుడు, టీమ్ లభించింది. అందుకు నేను లక్కీ. జీవితంలో ఏ విషయాన్నైనా అజయ్ భూపతి చూసే విధానం నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇలా కూడా ఆలోచిస్తారా? అనిపించింది. సంగీత దర్శకుడు అజనీష్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. పిచ్చి ప్రేమతో సినిమాకు వర్క్ చేయడం చూశా.

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారా?

స్వాతి : తప్పకుండా చేస్తా. ఈ ఏడాది సినిమా కాకుండా ఇంకా చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశా. పిజ్జా బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశా. కిడ్స్ సెంటర్ ఒకటి, సెమి కండక్టర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాం.
సురేష్ వర్మ : సక్సెస్ ఫెయిల్యూర్ అని కాకుండా ప్రాసెస్ ఎంజాయ్ చేయడం మా బాస్, స్వాతి ఫాదర్ నిమ్మగ్గడ్డ ప్రసాద్ గారు నేర్పించారు. మేం ఈ సినిమా ప్రాసెస్ ఎంజాయ్ చేశాం. మాటీవీలో కూడా ఎంజాయ్ చేస్తూ పని చేశాం. జయాపజయాలతో సంబంధం లేకుండా, మా ప్రయత్నలోపం లేకుండా సినిమాలు చేస్తాం.

నార్మల్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందన్నారు. అప్పుడు మీకు రిస్క్ అనిపించిందా?

స్వాతి : మేం ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం స్కేల్ పెరిగింది. ఆ బడ్జెట్ పెడితే అజయ్ భూపతి గారి విజన్ స్క్రీన్ మీదకు వస్తుందని అనిపించింది. రొటీన్ కాకుండా డిఫరెంట్ గాచేశాం. ఈ తరహా కథలు, జానర్ సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకని, హ్యాపీ! మ్యూజిక్, నటీనటుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు.

విడుదలకు ముందు టేబుల్ ప్రాఫిట్ రావడం ఎలా ఉంది?

స్వాతి, సురేష్ వర్మ : (నవ్వుతూ…)  అది ఎవరికైనా సంతోషం కలిగించే వార్తే కదా! మా మొదటి ప్రయత్నానికి అందరి నుంచి మంచి మద్దతు లభించింది. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం.

మిగతా భాషల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది?

సురేష్ వర్మ : మంచి స్పందన ఉంది. తమిళంలో ట్రైడెంట్ రవి గారు విడుదల చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.

పాయల్ కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?

స్వాతి : అజయ్ భూపతి గారు 40, 50 ఆడిషన్స్ చేశారు. మధ్యలో పాయల్ పేరు చర్చకు వచ్చింది. కానీ, ఆమె ఇంతకు ముందు చేసిన పాత్రల కారణంగా ఈ సినిమాలో పాత్రకు సూట్ అవుతుందా? లేదా? అని సందేహం కలిగింది. మేం లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే చేశాం. పాయల్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎంతో కష్టపడి చేసింది.

నెక్స్ట్ సినిమా?

స్వాతి : ఆలోచిస్తున్నాం. మళ్ళీ మేం ఎగ్జైట్ అయినప్పుడు తప్పకుండా చేస్తాం.

అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలు మీకు ఫ్రెండ్స్! వాళ్ళతో సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయా?

సురేష్ వర్మ : భవిష్యత్తులో చేయవచ్చు.
స్వాతి : ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవు. వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాకు స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారు. అలాగని, వెంటనే అడగలేను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకుని, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళను అడుగుతా. ఇప్పుడు అడిగితే నా కోసం వాళ్ళు చేస్తారు. అలాగని, నేను అడగలేను.

చిరంజీవి గారు ట్రైలర్ ట్వీట్ చేసి మీ గురించి బాగా చెప్పారు. ఎలా అనిపించింది?

స్వాతి : చాలా ఎమోషనల్ మూమెంట్ అది. పిల్లలంతా కలిసి ఉంటాం. ‘నువ్వు కూడా మీ నాన్నలానే’ అని కలిసినప్పుడు అంటూ ఉంటారు. ‘మంగళవారం’ టీజర్, ట్రైలర్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. పోస్టర్ విడుదలైన తర్వాత నాకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకున్నా. (నిమ్మగడ్డ నుంచి గునుపాటి). నాన్నకు టీజర్ చూపించినప్పుడు పేరు చూసి ‘సురేష్ తో కలిసి నువ్వు చేస్తున్నావా?’ అని అడిగారు. అప్పుడు హ్యాపీ ఫీలయ్యారు.
సురేష్ వర్మ : నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు చూస్తే చాలు అని ఫీలయ్యా. ఈ రోజు మా సినిమాకు ఆయన ట్వీట్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి.

సినిమా

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్...

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్...

“కృష్ణ” రీ-రిలీజ్‌కు షాక్.. బుకింగ్స్ లేక విడుదలే రద్దు!

మాస్ మహారాజా Ravi Teja కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో Krishna ఒకటి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2008లో...

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు....

“జగదేక వీరుడు అతిలోక సుందరి”..పై నాని ఎమోషనల్ వీడియో!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌గా మాత్రమే కాదు.. ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో Jagadeka Veerudu Athiloka Sundari...

రాజకీయం

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

ఎక్కువ చదివినవి

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర సినీ తారలు కూడా రాజకీయాల్లోకి వస్తారా...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. నిర్మాత–దర్శకులను...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...