Gunturu Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం షూటింగ్ ఇంకా ఎంత కాలం జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సంక్రాంతికి సినిమా ను విడుదల చేసి తీరుతాం అంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలకు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ప్రమోషన్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రమోషన్ చేయాల్సిన సమయంలో ఇంకా షూటింగ్ అంటే ఎలా మహేష్ అంటూ కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. త్రివిక్రమ్ ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. అయినా కూడా సమయానికి పూర్తి చేయలేక పోయాడు.
సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరో పది వర్కింగ్ డేస్ పాటు గుంటూరు కారం షూటింగ్ చేయాల్సి ఉంటుందట. హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించి, చివరి రెండు వారాల్లో ప్రమోషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి గుంటూరు కారం విడుదల ఖాయం.