చూస్తుంటే లోకేష్ కనగరాజ్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను చాలా సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలే లియోతో భారీ విజయాన్ని అందుకున్న లోకేష్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో పనిచేయబోతున్నాడు. దాని తర్వాత కార్తీ తో అందరూ ఎదురుచూస్తోన్న ఖైదీ 2 ఉండనే ఉంది. అయితే ఖైదీ 2 కంటే ముందు లోకేష్ కనగరాజ్ ఒక భిన్నమైన ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను వివరిస్తూ అందులోని డ్రగ్స్ కోణం ఎలా ఉంటుంది, పాత్రలు అన్నీ ఒకదానికి ఒకటి ఎలా కలుస్తాయి, వాటి టైంలైన్స్… ఇలా వివరిస్తూ ఒక షార్ట్ ఫిలిం ను చేయబోతున్నాడట. నరేన్ కూడా ఇందులో భాగమని తెలుస్తోంది.
ఈ షార్ట్ ఫిల్మ్ థియేటర్లలో విడుదలవ్వదు కానీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. దీని ద్వారా ఎల్ సీయూ మీద పూర్తి క్లారిటీ వస్తుందిట.