Narnia: ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ ఎటువంటి చిత్రమైన సంఘటనలు జరిగినా వైరల్ అవుతున్నాయి. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ సినిమా క్లైమాక్స్ లో సముద్ర తీరాన సింహం గంభీరంగా నుంచునే సన్నివేశం నిజ జీవితంలో ఎదురైతే అద్భుతం.. అంతకుమించి ఆశ్చర్యమే కదా. అటువంటి సన్నివేశం గుజరాత్ సముద్ర తీరాన కనిపించడం విశేషం. దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వన్ ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.
సింహం సముద్ర తీరన ఉండి సముద్ర అలలను ఆస్వాదిస్తున్నట్టు ఉన్న పిక్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. గంభీరమైన సింహం భీకరమైన సముద్రపు అలలను ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నట్టు ఈ ఫొటో ఉంది. ‘నార్నియా సినిమా నిజమైన సందర్భం.. గుజరాత్ తీరంలో అలలను ఆస్వాదిస్తున్న సింహం’ అని రాసుకొచ్చారు. దీంతోపాటు సింహాలు సముద్ర తీరాల్లో నివసించే అంశంపై ఓ పరిశోధనా పత్రాన్ని కూడా ఆయన షేర్ చేశారు. ఆసియా సింహాలు నివాసముండే ప్రాంతాలకు వెళ్లి కొందరు ఈ అద్భుతమైన ఫొటో తీశారని రాసుకొచ్చారు.
When #Narnia looks real. A lion king captured enjoying tides of Arabian Sea on Gujarat coast. Courtesy: CCF, Junagadh. pic.twitter.com/tE9mTIPHuL
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 1, 2023