Sitara: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ముద్దుల సితార (Sitara) చూపిన ఔదార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్ ని ఓ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రారంభోత్సవంలో తల్లి నమ్రత (Namratha)తో కలిసి సితార పాల్గొన్నారు.
కార్యక్రమంలో పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఓ వృద్ధురాలు వేదిక పైకి వచ్చేందుకు ఇబ్బంది పడుతూండగా సితార కిందకి వచ్చి ఆమెకు చేయి అందించి వేదిక పైకి తీసుకొచ్చారు. వారికి బహుమతులు అందించి నవ్వుతూ మాట్లాడారు. ఇందుకు ముగ్దురాలైన వృద్ధురాలు ఆమెను అపురూపంగా ముద్దు పెట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అంటూ మహేశ్ అభిమానులు, నెటిజన్లు సితారను కొనియాడుతున్నారు. ఇటివల జ్యూవెలరీ యాడ్ లో నటించిన సితార తనకు వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు. ఆమధ్య తన పుట్టినరోజున అనాధలైన ఆడపిల్లలకు ఉచితంగా సైకిల్స్ పంపిణీ చేశారు.
మహేశ్ బాబు కూతురి ప్రేమ❤️ చూడండి @urstrulyMahesh #Sitara ❤️ pic.twitter.com/VHSSNLlCfp
— Nagendra (@mavillanagendra) October 1, 2023