Switch to English

LEO Review: లియో మూవీ రివ్యూ – అంచనాలను పూర్తిగా అందుకోలేదు

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow
Movie లియో
Star Cast విజయ్, సంజయ్ దత్, త్రిష, అర్జున్
Director లోకేష్ కనగరాజ్
Producer లలిత్ కుమార్
Music అనిరుధ్ రవిచంద్రన్
Run Time 2గం 44ని
Release అక్టోబర్ 19, 2023

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ అద్భుతమైన క్రేజ్ ను తెచ్చుకున్న లియో దసరా సందర్భంగా ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

హిమాచల్ ప్రదేశ్ లోని ఒక హిల్ స్టేషన్ లో బేకరీ నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు పార్తీబన్ (విజయ్). ఒక రోజు లోకల్ రౌడీలతో జరిగిన గొడవ కారణంగా పార్తీబన్ కోర్టులో సరెండర్ అవుతాడు. అయితే ఆ న్యూస్ ను టివిలో చూసిన అండర్ వరల్డ్ క్రిమినల్ (సంజయ్ దత్) లియో కోసం అక్కడికి వస్తాడు. ఇంతకీ లియో ఎవరు? అతనికీ అండర్ వరల్డ్ కు ఉన్న సంబంధం ఏంటి?

ఇంతకీ ఈ లియో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు ఎలా కనెక్ట్ అవుతుంది?

నటీనటులు:

దళపతి విజయ్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది. తన స్క్రీన్ ప్రెజన్స్ సూపర్బ్. రెండు డైమెన్షన్స్ ఉన్న పాత్రను విజయ్ చాలా సులువుగా చేసాడు. త్రిష, విజయ్, పిల్లాడి కాంబినేషన్ లో సీన్స్ చాలా బాగా వచ్చాయి.

ఇక ప్రముఖ పాత్రల్లో కనిపించిన సంజయ్ దత్, అర్జున్ ల పెర్ఫార్మన్స్ పాత్రకు తగ్గట్లు సాగింది. ప్రియా ఆనంద్ కూడా చిన్న పాత్రలో మెరిసింది. మిగిలిన వాళ్ళందరూ మాములే.

సాంకేతిక నిపుణులు:

ముందుగా హాలీవుడ్ స్టైల్ లో సినిమాటిక్ యూనివర్స్ ను బిల్డ్ చేస్తోన్న లోకేష్ కనగరాజ్ ను మెచ్చుకునే తీరాలి. లియోకు యూనివర్స్ తో ఉన్న కనెక్షన్ సంగతి పక్కనపెడితే లోకేష్ కు పెద్ద బలమైన సెకండ్ హాఫ్ విషయంలోనే ఈసారి తడబడ్డాడు. సెకండ్ హాఫ్ ను ఇంకొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. దానికి తోడు ఈ సినిమాటిక్ యూనివర్స్ లోకి లియోను బలవంతంగా చొప్పించినట్లు అనిపిస్తుంది.

అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. చాలా సీన్స్ ను కేవలం తన బ్యాక్ గ్రౌండ్ తోనే లేపాడు అంటే అతిశయోక్తి కాదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చిత్రానికి తగినట్లుగా సాగింది. ఇక నిర్మాణ విలువలు చాలా లావిష్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • విజయ్ పరిచయ సన్నివేశం
  • స్క్రీన్ ప్లే
  • అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

  • నరేషన్ లో ఉన్న లొసుగులు
  • బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం

విశ్లేషణ:

అటు ఫస్ట్ హాఫ్ ఇటు సెకండ్ హాఫ్ కూడా ఒక దశ వరకూ మెప్పించే లియో, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక డీసెంట్ ఫిల్మ్ అనిపించుకుంటుంది. ఈ ఎల్ సీయూ కాన్సెప్ట్ మీకు నచ్చితే కచ్చితంగా లియో కూడా నచ్చుతుంది. అంచనాలను అదుపులో పెట్టుకుని చూస్తే లియో నచ్చే అవకాశాలున్నాయి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

1 COMMENT

సినిమా

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్...

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

రాజకీయం

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 మార్చి 2025

పంచాంగం తేదీ 22-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ అష్టమి రా. 12.34 వరకు...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే గ్యాప్ దొరికితే...

బెట్టింగ్ యాప్స్.! ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకే కోట్లు చెల్లించారా.?

బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దయెత్తున సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ.....

రాబిన్ హుడ్ కోసం డేవిడ్ వార్నర్ వచ్చేశాడు..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా...