Switch to English

సరిలేరు నీకెవ్వరూ: మహేష్‌కి ఇదేం తలనొప్పి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

చేస్తున్న సినిమాల విషయంలో ఇదివరకటితో పోల్చితే అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. కానీ, ఆ అదనపు జాగ్రత్తలేవీ అతనికి అంతగా కలిసొస్తున్నట్లు కన్పించడంలేదు. త్వరలో మహేష్‌ చేయబోతున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి సంబంధించి చాలా రకాల ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో కొన్ని నిజాలు కూడా లేకపోలేదు. అత్యంత గోప్యంగా వుంచుదామనుకున్న టైటిల్‌ ముందే లీక్‌ కావడంతో, పెద్దగా హంగామా లేకుండా సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రివీల్‌ చేసేశారు. ఇక, ఈ సినిమాలో మహేష్‌ మిలిటరీ మేజర్‌ పాత్రలో కన్పిస్తాడంటూ ఇంకో గాసిప్‌ బయటకొచ్చింది. విజయశాంతి గురించీ, సినిమాలో ఇతర పాత్రల గురించీ ఎప్పటికప్పుడు లీకులు బయటకు వస్తూనే వున్నాయి.

తాజా గాసిప్‌ ఏంటంటే, ఈ సినిమాలో విజయశాంతి పవర్‌ ఫుల్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌లా కన్పించబోతోందట. ఆమె పాత్ర పాజిటివ్‌గా వుంటుందనీ, సినిమాకి ఆమె పాత్ర కూడా ఓ హైలైట్‌ అవుతుందనీ తెలుస్తోంది. జగపతిబాబు మెయిన్‌ విలన్‌గా చేస్తున్నా, తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో యువ నటుడ్ని, నెగెటివ్‌ రోల్‌ కోసం తీసుకుంటున్నారన్నది మరో తాజా గాసిప్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ రూపొందనుంది. అయితే, లీకులన్నీ అనిల్‌ రావిపూడి టీమ్‌ నుంచే బయటకు వస్తున్నాయని గ్రహించిన మహేష్‌ ఆల్రెడీ ఈ విషయమే దర్శకుడ్ని హెచ్చరించాడట. కానీ, ఏం లాభం.?

అలా మహేష్‌ హెచ్చరించిన తర్వాతే విజయశాంతి పాత్ర గురించిన తాజా లీక్‌ వెలుగు చూసింది. ‘కథ ఇదీ..’ అంటూ నాలుగైదు కథలు ఆల్రెడీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. ప్రస్తుతానికైతే మహేష్‌, ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్‌ పూర్తిచేసుకుని హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు కుటుంబ సమేతంగా. నిన్ననే ఇటలీకి పయనమైన మహేష్‌ ఫ్యామిలీ, వెకేషన్‌ త్వరలోనే పూర్తి చేసుకోనుంది ఆ తర్వాతే మహేష్‌, ‘సరిలేరు నీకెవ్వరూ’ షూటింగ్‌కి అటెండ్‌ అవుతాడు. రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం విదితమే. మొత్తమ్మీద, మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరూ’ లీకుల్ని మాత్రం ఆపలేకపోతున్నాడన్నమాట.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...