Switch to English

లగడపాటి ‘వంట’ పూర్తయ్యిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి ‘ఆంధ్రా ఆక్టోపస్‌’ అనే పేరుండేది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు పాపం ఆయనకు ఆ పేరు పోయింది. చాలా దారుణంగా లగడపాటి లెక్కలు తప్పాయి. మహా కూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి చెబితే, గులాబీ పార్టీ బంపర్‌ విక్టరీ సాధించింది. దానికి ఆయన ఏవో కవరింగ్‌లు చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ, లగడపాటి ఉత్తుత్తి సర్వే చేసి, ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేయబోయారని అర్ధమైపోయింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వస్తాయి. లగడపాటి కూడా ఓ సర్వేతో సిద్ధమవుతున్నారు. ఈసారి లెక్క తప్పదంటున్నారు. కానీ, గతంలోలానే ఇప్పుడు కూడా ఆయనగారి సర్వేపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ముఖ్యనేత ఒకరు లగడపాటితో కలిసి ‘వంటకం’ చేపట్టారనీ, కాబట్టి రుచితో అద్భుతాలేమీ ఉండవనీ, టీడీపీకి అనుకూలంగా మాత్రమే అది ఉంటుందనీ టీడీపీ వర్గాలే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్‌ విషయమేంటంటే, వైసీపీ ముఖ్య నేత ఒకరు కూడా లగడపాటి వంటకంలో పాలు పంచుకుంటున్నారట. సో అదే నిజమైతే, లగడపాటి వంటకం ఫలితాలొచ్చే లోపు కొంత సందడి చేయొచ్చు రాజకీయ వర్గాల్లో. లగడపాటి ఒక్కరే కాదు, ఇంకా చాలా వంటకాలు ఈ సారి రుచి చూడబోతున్నాం. దాదాపుగా పది నుండి పదిహేను వరకూ సర్వేలు జరిగాయట. వీటన్నింటి వెనకాల టీడీపీ, వైసీపీ నేతలే కనిపిస్తున్నారు. ఓ 8 సర్వేలు విడివిడిగా చేస్తే, అందులో రెండు కలిసే చేశారనీ చెప్పుకుంటున్నారు.

తెలుగు నాట ఇలాంటి సర్వేలకు గ్లామర్‌ తెచ్చింది నిస్సందేహంగా లగడపాటి రాజగోపాలే. అందుకే దాదాపుగా ఆయనగారి ఫార్మాట్‌లోనే డజనుకు పైగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఉంటాయనీ తెలుస్తోంది. ఇన్ని వంటకాలు ఎందుకు.? అనే ప్రశ్న రావడం సహజమే. రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. దాంతో గెలుపుపై అందరికీ అనుమానాలున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ పైకి ఏం చెబుతున్నా, లోలోపల అయోమయంతో దిగులు పడుతున్నారు అభ్యర్ధులు. ఈ పరిస్థితుల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఆయా అభ్యర్ధులకు కొంత ఊరటిస్తాయి. అదే సమయంలో అధికారం ఎటువైపు మొగ్గుతుందో ఓ ఐడియా వస్తే, ముందే గోడ దూకేయడానికి అవకాశం కలుగుతుంది. అలా అభ్యర్ధులు ఈ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు.

లగడపాటి వంటకం విషయానికి వస్తే, రేపో మాపో చంద్రబాబు ఆమోద ముద్ర పడబోతోందనీ, ఆ తర్వాతే అది వెలుగులోకి వస్తుందనీ తెలుస్తోంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితానికి కూడా లగడపాటి ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. అయితే అప్పుడు కొంచెం ముందే కూసింది ఆక్టోపస్‌ గారి లెక్కల కోడి. అందుకే అది తప్పుడు కూతగా మిగిలిపోయింది. ఆ అనుభవంతోనే ఈసారి కొంచెం సంయమనం పాఠించారు లగడపాటి. అయినా ఇన్నాళ్లపాటు ఫలితాల కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు విడుదలవబోయే ఎగ్జిట్‌ పోల్స్‌ని పట్టించుకునే అవకాశముందా.? లేనేలేదు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఎగ్జిట్‌ పోల్స్‌లో జనసేనను పరిగణనలోనికి తీసుకోవాలా.? వద్దా.? అనే సంశయం వీడలేకపోతున్నారట కొందరు నిర్వాహకులు. జనసేన గెలుపు, ఓటముల సంగతి తర్వాత.. ఆ పార్టీని లెక్కల్లోకి తీసుకోకపోతే, ఎగ్జిట్‌ పోల్స్‌ అనే మాటకే అర్ధముండదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...