Switch to English

బీజేపీ ట్రాప్‌లో పడ్డ కేసీయార్.! టీఆర్ఎస్ ఖేల్ ఖతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

టీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తెను బీజేపీ రీచ్ అవగలిగిందా.? ఆమెను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగాయంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా లూప్ హోల్స్ వున్నాయన్నమాట. కేసీయార్ కుటుంబంలోనే చాలా సమస్యలున్నాయనే విషయం ఆయన వ్యాఖ్యలతోనే అర్థమయిపోయింది.. ఇలా నడుస్తోంది చర్చ.

‘నా కుమార్తెను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నించారు. ఎంత దారుణమిది.?’ అంటూ కేసీయార్ వ్యాఖ్యానించాక, సహజంగానే బీజేపీ నుంచి అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఎటాక్ వచ్చింది. ‘ఏం, నువ్వు చేసిందేంటి.. 37 మంది ఎమ్మెల్యేలని లాగేశావ్.. అది దారుణం కాదా.? పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించిన నువ్వే, ఆ రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డావ్..’ అని బీజేపీ తీవ్రస్థాయిలో కేసీయార్ మీద విరుచుకుపడింది.

చిత్రమేంటంటే, ‘నిన్ను దేకేవాడే లేడు.. అలాంటప్పుడు, నీ కూతుర్ని మేమెందుకు మా పార్టీలోకి రప్పిస్తాం.? పైగా, నీ కూతురికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులున్నాయ్..’ అని బీజేపీ నేతలు కొందరు తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు కేసీయార్ మీద.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే, ఇంకో అడుగు ముందుకేశారు కేసీయార్ మీద విమర్శలు చేసే క్రమంలో. ‘నీ బిడ్డ టచ్‌లోకి వచ్చింది బీజేపీతో కాదు.. కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో నీ బిడ్డకి ఎలాంటి పాత్రా లేకుండా చేశావట కదా..’ అని అరవింద్ విమర్శించారు.

ఇది నిజంగానే చాలా పెద్ద బాంబ్.! ‘కుమార్తెను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేసీయార్..’ అంటూనే, ఆ ‘కుమార్తె’ కవిత చుట్టూ బీజేపీ తన ట్రేడ్ మార్క్ విమర్శలు చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఈ మొత్తం వ్యవహారానికి ఆస్కారం కల్పించిందే కేసీయార్.!

‘కేసీయార్ కుమార్తెనే బీజేపీ, కాంగ్రెస్ తమ వైపుకు తిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనమెంత.?’ అంటూ గులాబీ పార్టీకి చెందిన చాలామంది ప్రజా ప్రతినిథులు వాపోతున్నారట. ఈ నైరాశ్యం టీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిపోయే దిశగా తీసుకెళుతుందా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...