జీవిత రాజశేఖర్ అంటే మహా మాటకారి. ఆ విషయంలో ఆమెకు సాటి బహుశా టాలీవుడ్లో ఇంకెవరూ వుండరేమో. ఓ పక్క రాజశేఖర్, తన ‘అతి’ కారణంగా అందరి చేతా చీవాట్లు తినే పరిస్థితి వస్తే, దాన్ని జీవిత భలేగా కవర్ చేసింది. ‘మా ఆయన చిన్న పిల్లాడి లాంటోడు..’ అని చెప్పేసిందామె. దాంతో, అప్పటిదాకా రాజశేఖర్‌పై అసహనంతో ఊగిపోయినవారంతా శాంతిస్తారని బహుశా జీవిత భావించి వుండొచ్చు.
అయితే, ఇక్కడే జీవితలో ఇంకో ‘యాంగిల్’ బయటపడింది. వేదికపై చిరంజీవి – మోహన్‌బాబు చాలా స్నేహపూర్వకంగా కన్పించారు. మోహన్‌బాబుని ఓ సందర్భంలో కౌగలించుకుని, ముద్దు కూడా పెట్టేశారు చిరంజీవి. మరోపక్క జీవిత, చిరంజీవిని పొగిడేస్తూ.. మోహన్‌బాబుని కాస్త లైట్ తీసుకుంది.
‘మోహన్‌బాబుగారితో పోల్చితే చిరంజీవిగారే మాకు ఎక్కువ సాయం చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో తలెత్తిన చాలా సమస్యలకు పరిష్కారం చూపుతూ పెద్ద మనిషిలా వ్యవహరించారు..’ అంటూ చిరంజీవిని ‘కాకా’ పట్టేందుకు ప్రయత్నించింది జీవిత. నిజానికి కొన్నేళ్ళ క్రితం చిరంజీవిపై జీవిత, ఆమె భర్త రాజశేఖర్ చేసిన జుగుప్సాకరమైన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపైనా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పైనా జీవిత రాజశేఖర్ చేసిన విమర్శల్ని ఇప్పటికీ మెగాభిమానులు మర్చిపోలేరు. ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగినా వీలు చిక్కినప్పుడల్లా రాజశేఖర్, చిరంజీవిని టార్గెట్ చేస్తూనే వచ్చాడు. ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. మోహన్‌బాబు, రాజశేఖర్ మీద చాలా సీరియస్ అయ్యేసరికి, జీవిత తెలివిగా చిరంజీవిని పొగిడేస్తూ.. మోహన్‌బాబుని లైట్ తీసుకోవడం ద్వారా మోహన్‌బాబు, చిరంజీవిపై కాస్త చిన్నబుచ్చుకునేలా చేయగలిగిందన్నమాట.
369103 509773I think your suggestion would be useful for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 949426
862707 993526This really is the suitable blog for anybody who needs to seek out out about this subject. You notice so much its virtually laborious to argue with you (not that I genuinely would wantHaHa). You undoubtedly put a brand new spin on a topic thats been written about for years. Excellent stuff, just fantastic! 206787
880088 485463How do I know if a Wordpress theme supports a subscribe option? 360302