మెగా బ్రదర్, జనసేన నేత, నటుడు, నిర్మాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై సెటైర్లు వేయడంలో దిట్ట. అయితే, తాజాగా ఆయన వేసిన పొలిటికల్ సెటైర్ అస్సలు పేలలేదు. తుస్సుమంది.
‘ప్రియమైన జనసైనికులకి ఒక చిన్నమాట. పారసైట్స్ అంటే వికీ పీడియాలో మీనింగ్ చూడండి. ఈ పారసైట్స్ ని పట్టించుకుంటే ఇబ్బంది పెడతాయి. వదిలేస్తే చచ్చిపోతాయి. పనికిమాలివ విమర్శల్ని పట్టించుకోకండి.. వదిలెయ్యండి.. లవ్ నాగబాబు..’ అంటూ సెటైరేశారు నాగబాబు. ఈ సెటైర్ నాగబాబు, ఎవర్ని ఉద్దేశించి వేశారు.? అపరమేధావి, అపర మానవతావాదినని చెప్పుకునే గోగినేని బాబు మీదనా.? లేదంటే, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి మీదనా.? ఏమోగానీ, మెగా అభిమానులకీ, జనసైనికులకీ.. నాగబాబు ట్వీట్ అస్సలు నచ్చలేదు.
‘మేం మీలా వుండలేం.. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, చూస్తూ ఊరుకోలేం.. వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానమిస్తాం.. అయినా మీరెలా ఇంత లైట్ తీసుకోగలుగుతున్నారు.?’ అంటూ కొందరు జనసైనికులు, మెగా అభిమానులు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానులు, నాగబాబుని ప్రశ్నిస్తున్నారు.
ఇక, నాగబాబు భాషలోనే చెప్పాలంటే, పారసైట్స్ అనేవాటిని అస్సలు వదిలేయకూడదు. అవి పరాన్నజీవులు కదా.. వాటిని వదిలించుకోకపోతే, దేహానికి నష్టం. రోగానికి మందు వెయ్యాల్సిందే. గోగినేని బాబు లాంటోళ్ళను పట్టించుకోకపోయినా ఫర్లేదుగానీ, విజయసాయిరెడ్డి లాంటోళ్ళని ఖచ్చితంగా పట్టించుకోవాలి, వీలు చిక్కినప్పుడల్ల వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాల్సి వుంటుందన్నది మెజార్టీ జనసైనికుల భావన.
జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, ‘చెప్పు తిన్న కుక్క చెరకు తీపెరుగునా.?’ అంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద వేసిన సెటైర్, నాగబాబు దృష్టికి తీసుకెళ్తున్న జనసైనికులు, పవన్ కళ్యాణ్ మీద ఎవరన్నా విమర్శలు చేస్తే, గట్టిగా సమాధానం చెప్పాల్సిందేనని నాగబాబుపై ఒత్తడి తెస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు చురుగ్గా పాల్గొనకపోవడం పట్ల కూడా జనసైనికుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
795192 516657Respect to post author, some amazing data . 397678
845257 386480Thank you for your extremely great details and respond to you. I need to have to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make men and women feel. Furthermore, thanks for allowing me to remark! 524724